Rahul Gandhi : ట్రంప్‌కు ప్రధాని మోడీ భయపడుతున్నాడు..రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

అహింస కాంగ్రెస్‌ విధానమైతే.. బీజేపీది హింసా విధానమని ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆలోచన.. ప్రజలను మెప్పించి అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్‌ ఆలోచన అని,  ట్రంప్‌కు ప్రధాని మోడీ భయపడుతున్నాడని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

New Update
FotoJet (15)

Rahul Gandhi's key comments

 Rahul Gandhi : అహింస కాంగ్రెస్‌ విధానమైతే.. బీజేపీది హింసా విధానమని ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆలోచన.. ప్రజలను మెప్పించి అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్‌ ఆలోచన అని,  ట్రంప్‌కు ప్రధాని మోడీ భయపడుతున్నాడని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. కాగా ఈ రోజు ముగింపు కార్యాక్రమానికి రాహుల్‌ గాంధీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ నేతలు అంతా సింప్లిసిటీతో ఉండండి.. గాంధీ విధానమే మన విధానం.. పార్టీకి డీసీసీ అధ్యక్షులు సుప్రీం.. డీసీసీ అధ్యక్షులంతా నా టీమ్‌.. భవిష్యత్తు అంతా మనదే- అని రాహుల్‌ గాంధీ వివరించారు.

అనంతరం  కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి , కేసీ వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యమన్నారు. దేశం కోసమైనా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఇంకా మాట్లాడుతూ ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదన్నారు. గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పిన నాపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. అనంతరం ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి  తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై నేతలతో రాహుల్‌ చర్చించారు.  

Advertisment
తాజా కథనాలు