/rtv/media/media_files/2025/02/02/aaP7Ry61WisD3Q5lSCCr.jpg)
Ponguleti Srinivas Reddy
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15 లోపే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. కులగణనపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందింది. ఈ నెల 4న అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
Also Read: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల గుట్టు రట్టు
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని పొంగులేటి హెచ్చరిచారు. అలాగే రాష్ట్రంలో అర్హులందరికీ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. రెండు లేదా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో మొత్తం 12,845 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1,13,328 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కులగణన కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
Also read: 2022 నుంచి పరారీలో ఉన్నాడు..హైదరాబాద్ కాల్పుల నిందితుడు పాత దొంగే..
కులగణన సర్వే ప్రకారం తెలంగాణలో సామాజిక వర్గాల వారి జనాభా శాతం
ఎస్సీలు - 17.43 శాతం
ఎస్టీలు - 10.45 శాతం
బీసీలు - 46.25
ముస్లిం మైనార్టీ బీసీలు - 10.08 శాతం
ముస్లిం మైనార్టీ సహా బీసీలు - 56.33 శాతం
ముస్లిం మైనార్టీ ఓసీలు - 2.48 శాతం
మొత్తం ముస్లిం మైనార్టీ జనాభా - 12.56 శాతం
మొత్తం ఓసీలు - 15.79 శాతం
MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
mla-rajasingh cases
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. శోభాయాత్రలో రాజాసింగ్ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్‌పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.
ముస్లింలకు వ్యతిరేకం కాదు
వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు.
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..
Chiru Family: సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు
YS Jagan : జగన్‌కు ఎస్ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!
డాక్టర్ల నిర్లక్ష్యం.. సగం కాన్పు చేయడంతో..?
TS: ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు