Poisonous fish : విషపు చేపలు :  ఇవి తింటే క్యాన్సర్ వచ్చి పోతారు.. తస్మాత్ జాగ్రత్త!

ఆరోగ్యం కోసం చేప తింటే.. అనారోగ్యమే కానుకగా వస్తోంది. గుండెకు మంచిదని, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతుండటంతో సామాన్యుడు ఎంతో ఇష్టంగా కొనుక్కుంటున్న ‘చేప’.. ఇప్పుడు సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది.

New Update
fish

ఆరోగ్యం కోసం చేప తింటే.. అనారోగ్యమే కానుకగా వస్తోంది. గుండెకు మంచిదని, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతుండటంతో సామాన్యుడు ఎంతో ఇష్టంగా కొనుక్కుంటున్న ‘చేప’.. ఇప్పుడు సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది.లాభాల కక్కుర్తితో కొందరు వ్యాపారులు చేపల చెరువుల్లో కుమ్మరిస్తున్న ‘చికెన్ వ్యర్థాలే’ ఇందుకు ప్రధాన కారణం.కోళ్ల ఫారాల్లో వాడే విపరీతమైన యాంటీ బయాటిక్స్, గ్రోత్ హార్మోన్లు ఈ వ్యర్థాల ద్వారా చేపల శరీరంలోకి, ఆపై మానవ జీర్ణవ్యవస్థలోకి చేరుతున్నాయి. దీర్ఘకాలంలో ఇవి క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.హైద్రాబాద్ నగరంలో  120 టన్నుల చికెన్ వ్యర్థాలను హెచ్‌ ఫాస్ట్‌ పోలీసుల బృందం సోమవారం స్వాధీనం చేసుకుంది.చికెన్‌ వ్యర్థాలు తరలిస్తున్న 9 లారీలను సీజ్‌ చేసింది. ఈ వ్యర్థాలను చెరువుల్లో చేపలకు ఆహారంగా వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రెండరింగ్‌ ప్లాంట్‌కు పంపాల్సిన వ్యర్థాలను మళ్లించి ఏపీలోని గుంటూరు, వినుకొండ, అద్దంకి, భీమవరంలోని చెరువులకు వీటిని తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.సాధారణంగా చేపలు కిలోకి పైగా బరువు పెరిగేందుకు దాదాపు ఆర్నెళ్ల నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది. రైతుల నుంచి కిలో బరువున్న చేపలను రూ.80 నుంచి రూ.90కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.దీంతో చేపల పెంపకంలో నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి.చేపలకు మేతగా బ్రాండెడ్‌ ఫీడ్‌కు బదులుగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తే నాలుగు నెలలకే కిలో బరువు పెరుగుతాయి.కిలో కోళ్ల వ్యర్థాలు రూ.18 నుంచి రూ.25కే చేపల చెరువుల నిర్వాహకులకు లభిస్తున్నాయి. 

ఒక కిలో కోడి మాంసం నుంచి సుమారు 250 నుంచి 300 గ్రాముల చికెన్‌ వ్యర్థాలు వస్తాయి.జీహెచ్ఎంసీ పరిధిలోని చికెన్ వ్యాపారుల నుంచి అతి తక్కువకు ఈ వ్యర్ధాలను అక్రమార్కులు కొనుగోలు చేసి ఏపీలోని చేపల చెరువులు, నగరంలో చేపలు పెంపకందారులకు సరఫరా చేస్తున్నారు. చేపలకు చికెన్ వ్యర్థాలు ఆహారంగా ఉపయోగించవద్దని ప్రభుత్వాలు నిషేధం విధించాయి.  2016లో ఏపీ ప్రభుత్వం కూడా నిషేధం అమల్లోకి తెచ్చింది. సాధారణంగా చేపల పెంపకానికి ఉపయోగించే ఫీడ్ ధర కిలో రూ.40 నుంచి 75 పైనే ఉంది. దీన్ని ఎకరానికి పదివేల చేప పిల్లలున్న (చిన్నసైజు) చెరువులో రెండు బ్యాగులు (100 కేజీలు), పెద్దసైజు చేపలు ఉన్న చోట్ల అయితే పది బ్యాగులు ప్రతిరోజూ వేయాల్సి ఉంటుంది. అదే చికెన్‌ వ్యర్థాలు అయితే ఎకరా చెరువుకు 2 క్వింటాళ్లు వేస్తే వారం వరకు ఆహారం వేయాల్సిన అవసరం ఉండదు. మరోవైపు పెల్లెట్స్‌ కంటే కోళ్ల వ్యర్థాలు తక్కువ ధరకు లభిస్తుండడంతో పాటు చేపలు సైతం త్వరగా పెరుగుతుండటంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు.చేపల చెరువుల్లో మేతకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడానికి కొందరు పెంపకందారులు చికెన్ వ్యర్థాలను వాడుతున్నారు. దీనివల్ల చెరువుల పర్యావరణానికే కాకుండా, ఆ చేపలను తింటున్న మనుషుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.  కోళ్ల ఫారాలలో కోళ్లకు రోగాలు రాకుండా ‘టెట్రాసైక్లిన్’, ‘సిప్రోఫ్లోక్సాసిన్’ వంటి యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతుంటారు. 

మనుషుల శరీరంలోకి

ఈ కోళ్ల వ్యర్థాలను చేపలు తినడం వల్ల ఆ యాంటీబయాటిక్స్ చేపల శరీరంలోకి వాటి ద్వారా మనుషుల శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల మనుషుల్లో యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ అంటే మందులు పనిచేయని పరిస్థితులు ఏర్పడుతాయి.  చికెన్ వ్యర్థాలలో సాల్మొనెల్లా , ఈ-కోలి  వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి చేపల ద్వారా మనుషులకు వ్యాపిస్తాయి.దీంతో తీవ్రమైన విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్ వంటి రోగాలకు కారణమవుతాయి.  కోళ్ల ఎదుగుదలకు వాడే కొన్ని రకాల హార్మోన్లు, కెమికల్స్ చేపల మాంసంలో నిల్వ ఉండిపోతాయి. ఇవి తిన్న మనుషుల్లో దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు చేపల చెరువులు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంది. చికెన్ వ్యర్థాలు నీటిలో కుళ్ళిపోవడం వల్ల నీటిలో అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విష వాయువులు విపరీతంగా పెరుగుతాయి. వ్యర్థాలు కుళ్ళే ప్రక్రియలో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ మొత్తాన్ని బ్యాక్టీరియా వాడేస్తుంది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోయి చేపలు ఊపిరాడక పైకి తేలి గుంపులు గుంపులుగా చనిపోతాయి. చెరువు నీరు మురికిగా మారి విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఇది చుట్టుపక్కల ఉండే గ్రామాల్లోని భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తుంది. చేపల నాణ్యత, దిగుబడి దెబ్బతింటుంది.  కలుషిత నీటి వల్ల చేపలకు తోక కుళ్లుడు, రెక్కల కుళ్లుడు, ఎర్రటి మచ్చల వ్యాధి వంటి ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. 

చికెన్ వ్యర్థాలు తిని పెరిగిన చేపలు ఒక రకమైన నీచు/కోడి వాసన వస్తాయి. మాంసం కూడా గట్టిగా లేకుండా మెత్తబడిపోతుంది. ఇలాంటి చేపలను మార్కెట్లో కొనడానికి వ్యాపారులు, వినియోగదారులు ఇష్టపడరు.హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ 400 నుంచి 500 టన్నుల చికెన్ వ్యర్థాలు వస్తాయి. అందులో దాదాపు 150 నుంచి 200 టన్నుల వ్యర్థాలు ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు రహస్యంగా తరలిస్తున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఏపీలోని కోస్తా కోస్తా జిల్లాల నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ నగరానికి సగటున 350 నుంచి 400 టన్నుల లైవ్  చేపలు వస్తాయి. హైద్రాబాద్‌లో నాన్‌వెజ్‌కు డిమాండ్ ఎక్కువ. వీకేండ్స్, ఆదివారాలు, పండుగల సమయాల్లో ఈ డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. హైద్రాబాద్‌కు వచ్చే చేపల్లో ఎక్కువగా ఏపీ నుంచి వచ్చిన చేపలే 70 నుంచి 80 శాతం ఉంటాయి. సాధారణంగా ప్రతిరోజూ హైద్రాబాద్‌కు 350 నుంచి 450 టన్నుల చేపలు వస్తాయి.  ఆదివారం లేదా పండుగ సమయాల్లో ఈ డిమాండ్ 500 నుంచి 600 టన్నులకు చేరుకుటుంది. ప్రతిరోజూ హైద్రాబాద్‌కు వచ్చే చేపల్లో సుమారు 80 నుంచి 100 టన్నుల వరకు చికెన్ వ్యర్థాలతో పెరిగిన చేపలు ఉంటాయని ఒక అంచనా..

Advertisment
తాజా కథనాలు