ఛీ ఛీ.. ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఫిజిక్స్ టీచర్ బాగోతం బట్టబయలు

బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ రావు బాగోతం బయటపడింది. స్పెషల్ క్లాస్ పేర్లతో విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై మహిళ టీచర్ ప్రశ్నించడంతో ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో మహిళా టీజర్ ఎంఈవోకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు.

New Update
physics teacher misbehaved

రాజేంద్రనగర్‌లో మరో కీచక టీచర్ బాగోతం బట్టబయలైంది. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన టీచర్.. కామంతో కళ్లు మూసుకుపోయి వికృత ఆనందం పొందాడు. ప్రశ్నించిన ప్రధానోపాద్యాయురాలితో గొడవ పడ్డాడు. తానే తోపంటూ విర్రవీగాడు. వెంటనే ఎంఈవోకు కంప్లీట్ చేయగా.. ఆయన స్పందించి సరైన గుణపాఠం చెప్పాడు. పూర్తివివరాల్లోకి వెళితే..

Also Read:  Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌!

ఫిజిక్స్ టీచర్ బాగోతం

బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో దివ్యాంగుడైన ఫిజిక్స్ టీచర్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్పెషల్ క్లాస్ పేర్లతో విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పదో తరగతి బాలికలకు మాత్రమే పాఠాలు చెబుతానంటూ వికృత ఆనందం పొందాడు. అదే సమయంలో విద్యార్థినిల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Also Read:  BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు

సాయంత్రం స్కూల్ ముగిసినప్పటికి బాలికలను ఇంటికి కూడా పంపించేవాడు కాదు. ఇక అతడి లైంగిక వేధింపులతో భయబ్రాంతులకు గురైన విద్యార్థులు.. తమపై జరుగుతున్న లైంగిక దాడిని ప్రధానోపాధ్యాయురాలికి చెప్పుకున్నారు. ఆమె వెంటనే వేణుగోపాల్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేయగా వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో చేసేదేమి లేక ప్రధానోపాధ్యాయురాలు పాఠశాల బయట నిరసన వ్యక్తం చేశారు.

Also Read:  Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు

ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పాఠశాల వద్దకు చేరుకుని ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం ఎంఈవోకు ఫిర్యదు చేశారు. దీంతోపాటు ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ విషయం తెలుసుకుని వెంటనే పాఠశాలకు చేరుకున్నాడు. ఆపై వేణుగోపాల్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎంఈవో శంకర్ నాయక్.. వేణుగోపాల్ రావును విధుల నుంచి సస్పెండ్ చేశారు. 

ఇలాంటిదే ఇటీవల మరో ఘటన

కోచింగ్ కోసం వచ్చిన ఓ విద్యార్థిని ఇద్దరు టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేసిన దారుణ ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫతేపుర్‌కి చెందిన ఓ విద్యార్థి వైద్య విద్య ప్రవేశానికి నీట్ కోచింగ్ కాన్పూర్‌లో తీసుకుంటుంది. 2022 డిసెంబర్‌లో ఆమె ఆ కోచింగ్ సెంటర్‌లో చేరగా.. జనవరి 1న న్యూఇయర్ పార్టీ వేడుకలు అని పిలిచారు. 

చాలా మంది విద్యార్థులు వస్తారని, తను కూడా రావాలని స్నేహితుడు ఫ్లాట్‌కి పిలిచాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కేవలం తను మాత్రమే ఉంది. ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి ఇద్దరు టీచర్లు అత్యాచారం చేసి, వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత అదే ఫ్లాట్‌లో ఆరు నెలల పాటు ఆమెను బంధించి అత్యాచారం చేశారు.

ఈ విషయం బయటకు చెప్పవద్దని, ఒకవేళ చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. బయటకు తెలిస్తే కుటుంబ పరువు ఏమవుతుందని ఆలోచించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని అమ్మాయి ఇంటికి వెళ్లిపోయింది. కానీ ఇటీవల మరో అమ్మాయిని కూడా ఇలానే వేధిస్తున్న వీడియో ఆమెకు కనపడింది.

దీంతో ధైర్యం చేసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులైన ఇద్దరు టీచర్లను అరెస్టు చేశారు. అత్యాచారం, అక్రమ నిర్భంధం, నేరపూరిత బెదిరింపు, పోక్సో నేరాల కింద అరెస్ట్ చేసినట్లు కాన్పుర్ పోలీసులు తెలిపారు. 

Also Read:  Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో ఇస్లావత్ దీపిక (19)అను మహిళను భర్త శ్రీను, అత్తమామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారు. దీంతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

New Update
Bhadradri Kothagudem crime news

Bhadradri Kothagudem crime news

TG Crime: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఇస్లావత్ దీపిక (19)కు ఆరు నెలల క్రితం వెంకట్యాతండా స్టేజీకి చెందిన బోడా శ్రీనుతో వివాహం జరిగింది. వివాహానంతరం కొద్దికాలం దాంపత్య జీవితం అనుకూలంగా సాగింది. కానీ వేగంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం దీపిక మూడు నెలల గర్భంతో ఉంది. ఈ సమయంలో ఆమెపై భర్త శ్రీను, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టారు. గత రెండు నెలలుగా దీపికపై నిరంతర వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది.

ప్రాణం తీసిన అదనపు కట్నం..

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులతో గొడవ జరిగినది. దీపికను భర్త శ్రీను, అత్తమామలు కలిసి దాడి చేశారు. సాయంత్రానికి పరిస్థితి మరింత విషమంగా మారింది. భర్త శ్రీను కూల్‌డ్రింక్‌లో పురుగుమందు, ఎలుకల మందు కలిపి దీపికకు తాగించాడు. దీని తరువాత తాను కూడా అదే విషపు మిశ్రమాన్ని తాగాడు. దీనివల్ల ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వారిని ఖమ్మంలోని ఒక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న దీపిక పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడే మృతి చెందింది. శ్రీను పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: పల్నాడులో ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే ఐదుగురికి..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీపిక తండ్రి వత్మాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీపిక మృతి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయస్సులోనే గర్భంతో ఉన్న కూతురును కోల్పోయిన వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఇలాంటి ఘోరమైన చర్యకు ఒడిగట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపికకు న్యాయం చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: వేసవిలో గుండె జబ్బులు ఉన్నవారు ఇవి గుర్తుంచుకోవాలి

( ts-crime | ts-crime-news | crime news | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment