TG News: మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్లులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తనమీద నమోదైన కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిరోధర ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికించారని ఫిటిషన్ లో పేర్కొన్నారు. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. హరీష్ రావు తన ఫోన్ టాప్ చేయించారని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీష్ రావుతో పాటు మాజీ డిసిపి రాధాకృష్ణన్ రావుపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు.. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. నిరోధర ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికించారని తెలిపారు. Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే! ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణలు తెరపైకి.. మరోవైపు హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చర్చనీయాంమయ్యాయి. 2023 జనవరిలో తన ఫోన్ హాక్ చేసేందుకు బీఆర్‌ఎస్ లేదా బీజేపీ ప్రయత్నించిందని ప్రవీణ్ చెప్పడం సంచలనం రేపింది. తాను వాడుతున్న యాపిల్ ఫోన్‌కు కూడా ఈ అలెర్ట్ మెసేజ్ వచ్చిందని, తన ఫోన్‌ను స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ హాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హెచ్చరించిందని ప్రవీణ్ చెప్పారు. ఆ సమయంలో ఇది రాష్ట్ర స్థాయిలో బీఆర్‌ఎస్ పార్టీ లేదా కేంద్ర స్థాయిలో బీజేపీకి పార్టీ పని అయి ఉంటుందని ఆరోపించారు. ఇక 2019 నవంబర్‌లో హైదరాబాద్‌కు చెందిన పౌర హక్కుల అడ్వకేట్ రవింద్రనాథ్ కూడా గుర్తుతెలియని ఫోన్ నుంచి మెసెజ్‌లు వచ్చాయని, హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నించారంటూ తెలిపారు. ఇది కూడా చదవండి: రోశయ్య క్రమశిక్షణ నాకు స్ఫూర్తి.. ఆయన వల్లే తెలంగాణ ఏర్పాటు! Also Read: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. సుఖ్‌బీర్ సింగ్‍పై హత్యాయత్నం Also Read: గదిలో ఈ వస్తువులుంటే జాగ్రత్త.. లేకపోతే ప్రాణాంతకం జరగవచ్చు