/rtv/media/media_files/2025/02/15/ihsa8TAkk9qhKnG4mBSp.jpg)
Peddagattu Jatara
Suryapet Peddagattu Jatara : మేడారం తర్వాత తెలంగాణలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన లింగమంతుల స్వామి జాతర రేపటి నుంచి ఐదురోజులపాటు జరగనుంది.యాదవుల ఆరాధ్య దైవంగా పిలుచుకునే..ఈ పెద్దగట్టు జాతర సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో ప్రతి రెండు సంవత్సరాల కొకసారి మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. ఈ జాతరకు ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. పెద్దగట్టు లింగమంతుల స్వామి వారి జాతరకు భక్తుల సౌకర్యార్థం సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. పెద్దగట్టు జాతరకు సూర్యాపేట పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాల నుంచి కూడా భక్తులు ఈ జాతరకు తరలివస్తారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి ఆలయ ప్రాంతంలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనుంది.ఈ ఏడాది దాదాపు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు తరలివస్తారని అంచనా.
Also Read : USA: ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్
సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న దురాజుపల్లి గ్రామం పాలశేర్లయ్యగట్టు అనబడే గొల్లగట్టుపైన ఈ జాతర జరుగుతుంది. అయితే సొంత వాహనాల్లో హైదరాబాద్ వైపు నుంచి వెళ్లేవారు విజయవాడ మార్గంలో ప్రయాణించాలి. సూర్యాపేట దాటిన ఐదు కిలోమీటర్ల తర్వాత రోడ్డు పక్కన దురాజ్‌పల్లి గ్రామం బోర్డు కనిపిస్తుంది. అలాగే ఖమ్మం, కోదాడ వైపు నుంచి వచ్చేవారు.. హైదరాబాద్ మార్గంలో ప్రయాణించి, సూర్యాపేటకు దాదాపు ఐదు కిలోమీటర్లు ముందు రోడ్డు పక్కన జాతర ప్రాంతాన్ని గుర్తించవచ్చు.
Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!
ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారికి సూర్యాపేట నుండి పెద్దగట్టు జాతరకు బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20 అని వివరించారు. జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. భక్తులను సురక్షితంగా వారి గమ్య స్థానానికి చేర్చడంలో ఆర్టీసీ ముఖ్యపాత్ర పోషిస్తుందని సూర్యపేట జిల్లా ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖవంతమని అన్నారు. పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, ఇతర అధికారులతో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే వారు ముందుగా సూర్యాపేట చేరుకోవాలి.. అక్కడి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇక, కోదాడ నుంచి జాతరకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
Also Read : USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్
ఇక, జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గుట్టు చుట్టూ కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. జాతర సమీపంలో ఉన్న విజయవాడ - హైదరాబాద్ హైవే వెంట కూడా కర్రెలతో బారిరేడ్లు ఏర్పాట్లు చేశారు.ఇదిలాఉంటే, పెద్దగట్టు లింగమంతుల స్వామి- పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేయనున్నారు. జాతర సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద మళ్లించి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా పంపించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా మళ్లించనున్నారు.
Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు
ప్రత్యేకతలు
మేడారం సమ్మక్క - సారక్క జాతర మాదిరిగానే ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ జాతరను నిర్వహిస్తారు. తెలంగాణలో మేడారం తర్వాత అతిపెద్ద రెండో జాతరగా పెద్దగట్టుకు పేరుంది. పెద్దగట్టు జాతరనే గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమంతులస్వామి ఇక్కడ పూజలందుకుంటారు. చౌడమ్మ దేవతలు కొలువుదీరుతారు.ఈ జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు మధుమాసం, అమావాస్య ఆదివారం రాత్రి దిష్టికుంభాలు పోయడం చేస్తారు. దిష్టి పూజ చేయడం ఆనవాయితీ. ఆ తర్వాతే జాతర పనులను ప్రారంభిస్తారు. జాతరలో తొలి అంకమైన దిష్టిపూజను ఫిబ్రవరి 2వ తేదీనే పూర్తి చేశారు. బోనంతో బలిముద్దను తయారు చేసి పరిసరాల్లో ఎలాంటి అపశకనాలు జరగకుండా సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తారు. జాతరకు పది రోజుల ముందుగానే కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. లింగమంతులస్వామి, చౌడమ్మ దేవత, అనేక ఇతర విగ్రహాలను కలిగి ఉండే ‘దేవరపెట్టె’ జాతరలో కీలకమైన వేడుకగా భావిస్తారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయిపాలెం గ్రామం నుంచి ఈ దేవరెపెట్టే వస్తుంది. ఆ తర్వాత కేసారం గ్రామంలోని ఓ ఇంటికి చేరుతుంది.
జాతర తొలిరోజు తెల్లవారుజమున ఊరేగింపుగా ఈ దేవరపెట్టెను ఆలయానికి తీసుకవస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ పెద్దగట్టు జాతరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.ఈసారి జరగబోయే జాతరకు పదిహేను లక్షలమందికిపైగా వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మౌలిక వసతులు,విద్యుత్ సౌకర్యం, తాగునీరు తదితర ఏర్పాట్లకు నిధులు వినియోగించనున్నారు.తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర గా పేరొందిన సూర్యాపేట దురాజుపల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి- పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలులో ఉంటాయి.