/rtv/media/media_files/2025/02/28/ex2yBOnFhzgoLKMI5Mik.jpg)
Telangana crime rate
Telangana crime rate : శాంతి భద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పినట్టు కనిపిస్తున్నది. పట్టపగలు హత్యలు, దోపీడీలు, మత ఘర్షణలు, డ్రగ్స్ ముఠాలు, సైబర్ నేరాలు ఇలా తెలంగాణ వ్యాప్తంగా నేరాల రేటు విపరీతంగా పెరిగిపోయింది. హోంశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం, వ్యవస్థాగత సమీక్షలను పక్కనబెట్టడం, శాంతిభద్రతల పరిరక్షణపై క్రమంతప్పకుండా చేయాల్సిన పనులు చేయకపోవడం ఇందుకు కారణాలని సీనియర్ ఐపీఎస్‌లు విశ్లేషిస్తున్నారు.పోలీసు విభాగంపై సర్కారుకు పట్టుతప్పినట్టు కనిపిస్తున్నదని పోలీస్ స్టేషన్లలోనే సెటిల్‌మెంట్లు, భూదందాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది ఏసీబీ అధికారులు నమోదుచేసిన కేసుల్లో పోలీసులవే ఉండగా దాదాపు 40 మంది వరకు పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని వారు గుర్తుచేస్తున్నారు.
ఇది కూడా చూడండి: హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..!
ఇన్నాళ్లూ పోలీసులంటే పౌరుల్లో భయం, భక్తి కనిపించేదని, ఇప్పుడది లేక పట్టపగలే హత్యలు, దోపిడీలు, లైంగిదాడులు పెరిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేటికీ రాష్ర్టానికి హోంమంత్రి లేకపోవడం, సీరియస్‌గా రివ్యూలేమీ జరగకపోవడంతో కిందిస్థాయి సిబ్బందిలో పోలీస్‌బాస్ అంటే భయం లేకుండా పోయిందని, జవాబుదారీతనం లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. పైనుంచి అజమాయిషీ లేకపోవడం, నెలవారీ నేర సమీక్షలు జరగకపోవడంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి.
ఇది కూడా చూడండి:Kiara Advani : గుడ్ న్యూస్ చెప్పిన కియారా అద్వానీ .. తల్లి కాబోతున్నట్లు ప్రకటన
నిన్నమొన్నటిదాకా శాంతిభద్రతలకు నిలయంగా ఉన్న హైదరాబాద్‌లో థార్, చుడీదార్, చైన్‌స్నాచింగ్ గ్యాంగ్‌లు, భావరియా ముఠాలు, రైళ్లలో చోరీ చేసే గ్యాంగులు, కిరాయి హత్యల మూకలు, చిన్నారులను అపహరించే గ్యాంగులు తిష్టవేయడం ఆందోళన కలిగిస్తున్నది. పట్టపగలే దుకాణాలను కొల్లగొట్టడం, ఇండ్లలో చోరీలకు తెగబడడం, అర్ధరాత్రి శివారు ఇండ్లను లూటీ చేయడం, అడ్డొస్తే చంపేందుకూ వెనుకాడకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. చైన్‌స్నాచింగ్ గ్యాంగ్‌లు, గొలుసులు లాక్కునే క్రమంలో మహిళలను ఈడ్చుకెళ్తున్న ఘటనలు కలవరపెడుతున్నాయి.
ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు
ఇక పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన మొబైల్స్ చోరీ గ్యాంగులు హల్‌చల్ చేస్తున్నాయి. ఇక్కడ భారీగా ఫోన్లు దొంగిలించి సూడాన్‌కు పంపుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇన్నేండ్లు ఎక్కడో తలదాచుకున్న మూకలన్నీ ఒక్కసారిగా తెలంగాణను చుట్టుముట్టడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. ముఠాల్లో కొంత భయం పుట్టించేందుకు చోరీలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాల్లో కాల్పులు జరుపుతున్నారు. మరోవైపు అర్ధరాత్రి బైక్, కార్ రేసింగ్ బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లు, డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. రౌడీషీటర్లు, డ్రగ్స్ ముఠాలు, చోరీ గ్యాంగులపై నిఘా కొరవడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇది కూడా చూడండి: TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!
శాంతిభద్రతలు క్షీణించడంతో హత్యలతో తెలంగాణ.అట్టుడుకుతున్నది. హోమ్ శాఖ తన దగ్గరే పెట్టుకొన్న సీఎం కనీసం సమీక్ష చేయకపోవడంతో పోలీస్ వ్యవస్థను పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో రోజుకో చోట హత్య, కత్తుల తో వీరంగం పరిపాటయింది. మచ్చుకు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద తన దుకాణానికి ఎదురుగా మరో వ్యక్తి తోపుడు బండి అడ్డు పెట్టి వ్యాపారం చేస్తున్నాడని యజమాని ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాదన పెరిగి అది గొడవకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ క్రమంలో కత్తులతో దాడి చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. పట్టపగలు కత్తులతో వీరంగం సృష్టించడంతో అందరూ హడలిపోయారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు.దాడి చేసుకున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందస్తున్నారు.
ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు
తెలంగాణ లో అదుపుతప్పుతున్న శాంతి భద్రతలు.
— Telangana Awaaz (@telanganaawaaz)
హత్యలతో అట్టుడుకుతున్న తెలంగాణ.
హోమ్ శాఖ తన దగ్గరే పెట్టుకొని కనీసం సమీక్ష చేయని సీఎం
రోజుకో చోట హత్య, కత్తుల తో వీరంగం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద తన దుకాణానికి ఎదురుగా మరో వ్యక్తి తోపుడు బండి అడ్డు పెట్టి… pic.twitter.com/58nSwVfGVU