ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావంటూ కొందరు తనను బెదిరిస్తున్నారని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగీరా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. "నా ఇంటి అడ్రస్ ఇదే.. చేతనైతే రండి, దాడి చేయండి చూద్దాం" అంటూ పవన్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గతంలో ఏపీలో వైసీపీ గుండాలు తనను ఇలాగే బెదిరించారని పవన్ గుర్తు చేశారు.
రాజకీయాలకు అతీతం
తెలంగాణలో జనసేన పార్టీ ఎందుకని కొందరు నాయకులు ప్రశ్నించడంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున అని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో లక్షలాది మంది జనసేన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. ఈ గడ్డపై తనకు ఉన్న ప్రేమ కేవలం రాజకీయాల కోసమే కాదని, అది రాజకీయాలకు అతీతమైందని అన్నారు. తన సినిమాల్లో కూడా ఎప్పుడూ తెలంగాణ స్ఫూర్తి, యాస కనిపిస్తూనే ఉంటాయని, తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు.
తెలంగాణ నాయకులను తాను ఎప్పుడూ టార్గెట్ చేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. గడిచిన 12 ఏళ్లలో నేను ఎప్పుడైనా కేసీఆర్ గురించి కానీ, ఇక్కడి తెలంగాణ నేతల గురించి కానీ తప్పుగా మాట్లాడానా? అని ప్రశ్నించారు. ఏపీలో గతంలో తనను వైసీపీ వాళ్లు మాత్రమే బెదిరించారని, తెలంగాణ వాళ్లు తానెప్పుడూ బెదిరించలేదని.. కేవలం కొందరు నేతలు మాత్రమే ఇప్పుడు రాజకీయం కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో నిరుద్యోగం, ఉపాధి సమస్యలపై తనను లాగడంపై పవన్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో యువతకు ఉపాధి లేకపోతే దానికి పవన్ కల్యాణ్ కారణమా? అని నిలదీశారు. తెలంగాణ సమాజానికి ఎవరు అన్యాయం చేసినా సహించవద్దన్న ఆయన.. తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లను ఉరితీయండి.. ఒకవేళ ఆ అన్యాయం చేసిన వారిలో పవన్ కల్యాణ్ ఉన్నా సరే.. నన్ను కూడా ఉరితీయండి అంటూ అత్యంత భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తెలంగాణపై తనకున్నది నిఖార్సైన ప్రేమ అని, దాన్ని ఎవరూ శంకించలేరని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
అప్పట్లో పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన తీరును పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై మాట్లాడుతూ.. ప్రజలు గనుక కోరుకుంటే కచ్చితంగా తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కీలక ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతానికి రాజకీయాల కంటే ముందు ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రజలకు అండగా నిలబడాలని తన పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు ఆయన తెలిపారు. ఇక తాను ఓ చెరువు కబ్జా చేశానని వార్తలు రాశారని, అదే నిజమైతే ఆ స్థలాన్ని రాసి ఇస్తానని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ వేదికగా పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
pawan kalyan : తెలంగాణ మీ అయ్యా జాగీరా.. పవన్ సంచలన కామెంట్స్!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావంటూ కొందరు తనను బెదిరిస్తున్నారని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.