pawan kalyan : తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. జూన్ 02న కీలక ప్రకటన!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీలోని స్థిరమైన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత, ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు

New Update
Pawan Kalyan

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీలోని స్థిరమైన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత, ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా తెలంగాణ జనసేన ముఖ్య నాయకులతో పవన్ కల్యాణ్ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. 

రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఈ మీటింగ్‌లో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేయబోయే వ్యూహరచనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే, పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనకు వస్తున్న తరుణంలో ఇక్కడ ఒక ఆసక్తికరమైన రాజకీయ వివాదం నడుస్తోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కల్యాణ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. పవన్ కల్యాణ్‌ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని, ఆయన పర్యటనలను అడ్డుకుంటామని ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. 

జనసైనికులు సవాల్

దీనిపై తెలంగాణ జనసేన నేతలు కూడా అంతే ఘాటుగా స్పందించారు. తమ అధినేతను తెలంగాణకు రాకుండా ఎలా అడ్డుకుంటారో తాము కూడా చూస్తామంటూ జనసైనికులు సవాల్ విసురుతున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో, జూన్ 2న పవన్ కల్యాణ్ హైదరాబాద్ రాకపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది

Advertisment
తాజా కథనాలు