తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయి మాట్లాడారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలోని పిచ్చికుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడంటూ సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపించింది ఆరు గ్యారెంటీలు నెరవేర్చుమని.. నువ్వు అరు గ్యారెంటీలని చెప్పి జనాలను మోసం చేస్తున్నావ్.. వాళ్లు పెట్టే శాపనార్థాలకు కుక్క చావు చస్తావ్ అని కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు. బుధవారం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద కౌశిక్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే
నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే ఉంటానని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ.. తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నా కుటుంబం, కేసీఆర్ నా నాయకుడు. ఎప్పటికీ అదే పార్టీ, అదే నాయకుడి వెంట ఉంటానని స్పష్టం చేశారు.
Also read : ఏం మనిషివిరా.. ఫుల్ గా తాగి తమ్ముడి భార్యపై.. రెచ్చిపోయిన కానిస్టేబుల్!
బీఆర్ఎస్ కి నాకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ తెంచలేరన్నారు.కొంతమంది నా ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీకి ఉన్న చేతగాని పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నీచమైన ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ నా రాజకీయం, నా నమ్మకం, నా జీవితం అంతా బీఆర్ఎస్ పార్టీకి అంకితం. అధికారంలో ఉన్నా, లేకపోయినా నేను కేసీఆర్‌తోనే ఉంటానని మరోమారు స్పష్టం చేశారు.
Also read : ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
పిచ్చికుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు.. కౌశిక్ రెడ్డి సంచలనం!
సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయి మాట్లాడారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలోని పిచ్చికుక్కలకు రేవంత్ అధ్యక్షుడంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రజలు పెట్టే శాపనార్థాలకు కుక్క చావు చస్తావ్ అని కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు.