/rtv/media/media_files/2025/03/01/3iTbfn1XhwoGYfuiVUly.jpg)
TGSRTC. Photograph: (TGSRTC:.)
TGSRTC: ఇప్పుడంతా ఆన్ లైన్ విధానమే నడుస్తోంది. చిన్నచిన్న కిరాణం మొదలు పెద్ద షాపింగ్‌ల వరకు అన్ని క్యూఆర్ కోడ్‌తో ఆన్‌లైన్ చెల్లింపులే నడుస్తున్నాయి. దీంతో నేడు యూపీఐ చెల్లింపులు జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. ఇప్పటికే జనాలు ఈ యూపీఐ చెల్లింపు విధానానికి అలవాటు పడ్డారు. జేబులో పర్సు లేకపోయిన మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఇక ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానం మొదలు పెట్టింది.
Also read: యూఎస్ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు
ఇక మీదట ఈ విధానంతో టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వాలని అడగాల్సిన అవసరం కండక్టర్‌కు ఉండదు. ప్యాసింజర్ – కండక్టర్ మధ్య చిల్లర గొడవలకు ఆస్కారం ఉండదు. అందుకే ఇప్పటి నుంచి ప్రతి సిటీ బస్సులో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ఉంచుతారు. యూ పీ ఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు టీజీఎస్ ఆర్టీసీ కల్పించింది.. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆర్టీసీ ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చింది. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకీ తీసుకొస్తామని ఆర్‌టీసీ ప్రకటించింది.
Also Read: గుడ్ న్యూస్ ... తెలంగాణలో వారికి రేపటి నుంచి ఒంటిపూట బడులు
కాగా.. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. అయితే, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ క్రమంలో బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మరోవైపు ప్రభుత్వం మరిన్ని కొత్త బస్సులను కూడా ప్రవేశపెడుతోంది.
Also read : అంతా తూచ్.. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా : సీఐ సంచలన ప్రకటన