Nursing Student : గచ్చిబౌలిలో నర్సింగ్‌ విద్యార్థిని దారుణ హత్య!

జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్‌లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అది ముమ్మాటికీ హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

author-image
By Bhavana
New Update

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో గల రెడ్ స్టోన్ హోటల్ లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయం ఓ గదిలో శృతి అనే నర్సింగ్ విద్యార్థిని ఫ్యాన్‌ కి ఉరేసుకుని చనిపోయింది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌ కి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్‌లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

గతంలో యశోద హాస్పిటల్‌లో ట్రైనీ నర్సుగా పనిచేసిన శృతి కొంతకాలం క్రితం ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లిపోయింది. ఇటీవలే నగరానికి తిరిగివచ్చిన శృతి జాబ్ సెర్చింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే గత రాత్రి చిన్న అంజయ్య నగర్ రెడ్‌స్టోన్ హోటల్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అది ముమ్మాటికీ హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారి అనుమానాలను బలపరుస్తూ హోటల్ గదిలోని బెడ్ కింద మూడు బీర్ బాటిళ్లు, ఓ వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్ ఇతర వస్తువులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా గదిలో రక్తపు మరకలు కూడా ఉండడం ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

అనంతరం డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: అమెరికాలో కాల్పులు..ట్రంప్‌ నకు సమీపంలోనే ఘటన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment