ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాలు.. ఏం చేశారంటే ? ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారాలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలు చేసినందుకు గాను డారెన్ ఏస్‌మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ.రాబిన్‌సన్‌కు ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. By B Aravind 14 Oct 2024 in తెలంగాణ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Nobel Prize in Economics 2024: ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారాలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలు చేసినందుకు గాను డారెన్ ఏస్‌మోగ్లు (Daron Acemoglu), సైమన్ జాన్సన్ (Simon Johnson ), జేమ్స్ ఎ.రాబిన్‌సన్‌కు ( James Robinson) ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14తో ముగిసింది. గత సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్‌స్ర్కిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా అమెరికాకు చెందిన విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు ఈ నోబెల్ బహుమతి ప్రకటించారు. Also Read: చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. తొలిసారిగా ఇంజినీరింగ్ అద్భుతం భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌తో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకు గాను జాన్.జె.హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించి పరిశోధనలు చేసినందుకు గాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసబిస్, జాన్ ఎం. జంపర్‌కు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులు దక్కాయి. Also Read: తెలంగాణలోనే ఉంటాం.. క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ లు! సాహిత్యంలో నోబెల్ ఎవరికంటే ? ఇక దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌కాంగ్.. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఆమెను నోబెల్ పురస్కారం వరించింది. మానవ జీవిత దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను హాన్‌కాంగ్ కళ్లకు కట్టినట్లు చూపించారని స్విడీష్ అకాడమీ తెలిపింది. తాజాగా ఆర్థిక శాస్త్రానికి సంబంధించి నోబెల్ పురస్కారాలు ప్రకటించడంతో నేటితో ఈ ఏడాదికి నోబెల్ పురస్కారాల బహుమానాలు ముగిశాయి. Also Read: మా పరిచయం వ్యక్తిగత అనుబంధంగా మారింది: ఎన్. చంద్రశేఖరన్ ఎమోషనల్ 1901 నుంచి నోబెల్ పురస్కారాలు ఇదిలాఉండగా స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవాళ్లకు ఈ నోబెల్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించారు. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా అవార్డులను ప్రతీ ఏడాది ప్రదానం చేస్తున్నారు. నోబెల్ గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ నగదు కూడా అందుతుంది. ఇక డిసెంబర్ 10న నిర్వహంచబోయే కార్యక్రమంలో ఈ గ్రహీతలకు అవార్డులను అందజేయనున్నారు. Also Read: జగ్గారెడ్డి షాకింగ్ ప్రకటన.. ఇక గుడ్ బై! #telugu #international #nobel-prize మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి