BREAKING: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుక్కు బెయిల్
TS: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో రాహిల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.
TS: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో రాహిల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. మాజీ మంత్రి నేరెళ్ళ ఆంజనేయులు( ఎల్లారెడ్డి ) , జూక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరి కమలం గూటికి చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వారిని కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్.. బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేసవిలో జన సమీకరణ కష్టమని భావించి.. బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తెలంగాణకు చెందిన సుహాని రావు బోయిన్పల్లి మిస్ టీన్ గెలాక్సీ పోటీ UK టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. మార్చి 23న వారింగ్టన్ పార్ హాల్లో 25 మంది ఫైనలిస్టులతో పోటీ పడి ఈ గౌరవాన్ని సాధించింది.
కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలో పోచమ్మ ఆలయంలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి.. మంగళవారం రాత్రి హుండీలో డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. కానీ అతడి చేయి హుండీలో ఇరుక్కుపోయి బయటికి రాలేదు. ఉదయం అతడిని చూసిన స్థానికులు కట్టర్ సాయంతో చేయి బయటికి తీశారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయని కవిత బెయిల్‌కు అప్లై చేశారు. కవిత లాయర్ అభిషేక్ మను సింఘ్వి బెయిల్ కోసం వాదించారు. అయితే కోర్టు బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 4కు వాయిదా వేసింది.
తనకు జైలులో తినడానికి ఇంటి భోజనం అనుమతించడం లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కవిత అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తన గుండుకు పచ్చబోట్లు పొడిపించి, గాడిదపై ఊరేగిస్తాననే వ్యాఖ్యలపై ఆర్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు.
నిజామాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు చక్రవర్తుల నందిత, సూరారం శ్రీకాంత్‌లుగా గుర్తించారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలు ఇంతవరకు తెలియలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.