Congress : కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కన్నుమూత!
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
తెలంగాణ పీసీసీ ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రేసులో బీసీల నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కర్, ఎస్టీల నుంచి బలరాం నాయక్, సంపత్ కుమార్ ఉన్నారు .మధుయాస్కీ విషయంలో అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
జీవన్‌రెడ్డి విషయంలో పీసీసీదే తప్పని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ సమన్వయ లోపం కారణంగానే గందరగోళం నెలకొందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక గురించి ఆయనకు సమాచారం ఇవ్వకపోవడం తప్పేనన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి , కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టి .ప్రకాష్ గౌడ్ తదితరులు ఈ రోజు కేసీఆర్ ను కలిశారు. తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని వారు అధినేతకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేపడుతామని చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఆ మాట తప్పారని బీసీ జనసభనేత రాజారామ్ విమర్శించారు. పదేళ్లుగా దేశంలో కులగణన అనేదే లేకుండా పోయిందన్నారు. బీసీ కులగణనపై తొలివెలుగుకు ఆయన ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
మద్యం సేవించి తమను హింసిస్తున్నాడనే కోపంతో ఓ భార్య మామాతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా తిర్మలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాములు మృతదేహాన్ని రెండు రోజులు ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టి తర్వాత గుంత తవ్వి పూడ్చిపెట్టడంతో ఘోరం బయటపడింది.
TG: పోచారం ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. మొత్తం 12 మంది నాయకులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు సమాచారం. కేసు నమోదు అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఉన్నారు.
TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 7 వరకు పొడగిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.