Nandu World Couple : వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు: నందు దంపతులపై అడ్వకేట్‌ వీడియో రిలీజ్!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమపై వస్తున్న వీసా స్కామ్ ఆరోపణలపై . నంద కిశోర్, మధుమిత దంపతులు గట్టిగా స్పందించారు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని తేల్చి చెబుతూ.. వారి హైకోర్టు అడ్వకేట్ మాట్లాడిన ఒక వీడియోను నందు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

New Update
nandu

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమపై వస్తున్న వీసా స్కామ్ ఆరోపణలపై . నంద కిశోర్, మధుమిత దంపతులు గట్టిగా స్పందించారు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని తేల్చి చెబుతూ.. వారి హైకోర్టు అడ్వకేట్ మాట్లాడిన ఒక వీడియోను నందు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వ్యక్తిగత కక్షలతోనే నందు ఫ్యామిలీపై కావాలని కొందరు బురద జల్లుతున్నారని ఆ లాయర్ ఆ వీడియోలో స్పష్టం చేశారు.

ప్రస్తుతం వివాదంలో ఉన్న రిక్రూటింగ్ ఏజెన్సీ మధుకర్ అనే వ్యక్తిది. దాంతో నందుకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఏజెన్సీ కేవలం ఉద్యోగాల కోసం మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తుంది. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత గానీ, ఒకవేళ వీసా రిజెక్ట్ అయినా గానీ ఆ ఏజెన్సీకి ఎలాంటి సంబంధం ఉండదని సర్వీస్ ఇచ్చేటప్పుడే అగ్రిమెంట్‌లో క్లియర్‌గా రాసి ఉంది. అయినా సరే, ఏదో ఒక కారణంతో యూకేలో ఉద్యోగాలు పోగొట్టుకున్న కొందరు వ్యక్తులు కావాలనే నందు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  ఉద్యోగార్థులు గమనించాల్సింది ఏంటంటే.. వీసాలు ఇచ్చేది యూకే గవర్నమెంట్ కానీ, మధుకర్ ఏజెన్సీ కాదు. ఇప్పటివరకు యూకేలో ఈ ఏజెన్సీపై ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు.

ఎలాంటి బిజినెస్‌లు లేవు

నందు ఫ్యామిలీకి ఇండియాలో ఎలాంటి బిజినెస్‌లు లేవు. పైగా నందు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బ్రిటిష్ పాస్‌పోర్ట్ హోల్డర్స్.  అందువల్ల వారిపై ఇండియాలోని ఏ చట్టాలు వర్తించవని, చట్టపరంగా నందుని ఎవ్వరూ ఏం చేయలేరని అడ్వకేట్ క్లారిటీ ఇచ్చారు. నందు ఫ్యామిలీకి చెందిన కంపెనీల వల్ల ప్రస్తుతం యూకేలో దాదాపు 240 కుటుంబాలు ప్రశాంతంగా బ్రతుకుతున్నాయని, అలాంటి మంచి పేరున్న కుటుంబంపై కొందరు పనిగట్టుకుని తప్పుడు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని లాయర్ మండిపడ్డారు.

కాగా నంద కిశోర్, మధుమితలపై  రీసెంట్‌గా వీసా స్కామ్ ఆరోపణలు వచ్చాయి. నిరుద్యోగుల ఆశలను ఆసరా చేసుకుని కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంత జరిగినా వారు రియాక్ట్ కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ఈ స్కామ్ ఆరోపణలపై నందు వరల్డ్ మధుమిత రియాక్ట్ అయ్యారు.  సోషల్ మీడియాలో కొందరు కావాలనే కుట్రతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  ఇన్ స్టా గ్రామ్‌లో ఈ జంటకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు