MP Venkat Reddy: బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైంది
బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైందన్నారు.
బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైందన్నారు.
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ సిలిండర్ పేలింది. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సిలిండర్ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వడ్డెబోయిన సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో వర్షంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ఎన్నికల రణరంగానికి కాషాయసేన సిద్ధమౌతోంది. నేతలకు పని విభజనపై హైకమాండ్ దృష్టి పెట్టనుంది. బీజేపీ ఆఫీస్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు పార్టీ సభ్యులు. సమావేశంలో జవదేకర్,సునీల్ బన్సల్ పాల్గొన్నారు. ప్రచార కమిటీ పగ్గాలపై కీలక చర్చ నడుస్తోంది.
నల్గొండ జిల్లా పరిధిలో ప్రైవేట్ బస్ అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ -హనుమాన్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ తగలబడింది. కావేరి ట్రావెల్స్ బస్‌లో మంటలు చెలరేగాయి. బస్ వెనుక టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కావేరి బస్సు నెల్లూరు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్‌లో 26 మంది ప్రయాణికులున్నారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
నల్గొండ జిల్లాలో ఆకతాయిల వేధింపులకు బలైన ఇద్దరు యువతుల కేసులో ఓ ఫోన్ కాల్ బయటకు వచ్చింది. చనిపోయే ముందు శివానీ అనే యువతి తన అన్నకు ఫోన్ చేసి ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేసిన ఆడియో వైరల్‌గా మారింది. ఎవరో తన వాట్సాప్ డీపీని మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని వాపోయింది.
నల్గొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఆకతాయిల వేధింపులకు ఇద్దరు యువతులు బలయ్యారు. యువతుల వాట్సాప్ డీపీలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు దుండగులు. మార్ఫింగ్ ఫొటోలను వైరల్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు యువతుల ఆత్మహత్య చేసుకున్నారు. మనీషా, శివాని అనే ఇద్దరు యువతులు నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు.
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు పంచి తన అభ్యర్థిని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
త్వరలోనే బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమేనని స్పష్టం చేశారు. 99 శాతం పేదలకు అధికారం దక్కాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.