BREAKING: జుక్కల్, అందోల్, నల్గొండలో కాంగ్రెస్ గెలుపు
తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తాజాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతారావు గెలిచారు.
తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తాజాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతారావు గెలిచారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అని అన్నారు ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన మొక్కు నేటితో తీరిపోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. తన గడ్డం తీసేసే సమయం వచ్చిందని పేర్కొన్నారు.
నాగార్జున సాగర్ డ్యామ్ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. డ్యామ్ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చారని మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు.
కృష్ణా బోర్డు వైఫల్యంతోనే సాగర్ డ్యామ్ వివాదం తలెత్తిందని ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ కృష్ణాబోర్డు ఛైర్మన్ శివనందన్ కమార్‌కు లేఖ రాశారు. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఈరోజు రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ, ఏపీ అంగీకరించాయి. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాస్థానంలో కార్తికమాసం విశిష్టతను చాటే ఆధ్యాత్మిక పర్వాలు షురూ కానున్నాయి. ఈ మేరకు దేవస్థానం సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ పర్వాలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. ఈనెల 23న ప్రారంభమై..27వ తేదీన ముగియనున్నాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల మనిషి అని..అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతారన్నారు ఆయన సతీమణి సబితా. వెంకట్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. పదేళ్ల నుంచి పార్టీని కాపాడేందుకు ఎన్నో కష్టాలు పడ్డారని...ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారని అన్నారు.
జాతీయ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడించడంతో..కేటీఆర్ కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ వైపు సానుకూల పవనాలు వీస్తున్నాయని..అవన్నీ సునామీగా మారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.
బీఆర్ఎస్ 100సీట్లతో గెలవడం ఖాయమన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కొడంగల్ , కామారెడ్డి, గజ్వేల్‌లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. జనగామలో తన గెలుపును ఎవరూ ఆపలేరని పల్లా అన్నారు.