TS News: దొంగ సర్టిఫికెట్‌తో అడ్డంగా బుక్కైన డీఎంహెచ్‌వో

ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కుమారుడి ఉన్నత చదువు కోసం దొంగ సర్టిఫికెట్‌ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్‌. ఆ తప్పుడు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ గెజిట్‌ విడుదల చేశారు.

New Update
fake caste certifcate

Fake Caste Certifcate

TS News: కుమారుడి చదువు కోసం ప్రభుత్వాధికారి అడ్డదారులు తొక్కాడు. తాను ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కొడుకు ఉన్నత చదువుల కోసం దొంగ సర్టిఫికెట్‌ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు. సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్‌ సమర్పించిన తప్పుడు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ను కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ రద్దు చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి గెజిట్‌ కూడా విడుదల చేశారు. సూర్యాపేటలో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్థన్‌ ఎస్సీ కులానికి చెందిన అరుణజ్యోతిని వివాహం చేసుకున్నారు.  ఈ దంపతులకు ప్రణవ్ వర్దన్, ప్రత్యూష్ వర్దన్ కుమారులు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో 2017 సంవత్సరంలో విడిపోయారు.

ఇది కూడా చదవండి: మహిళలు ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ 5పనులు చేయాల్సిందే?

దొంగ సర్టిఫికెట్ పెట్టి..

పిల్లలు మాత్రం తండ్రి హర్షవర్థన్‌ దగ్గరే ఉంటూ చదువుకుంటున్నారు. 2018 వరకు పిల్లల క్యాస్ట్‌ బీసీ(డి)గా స్కూల్‌ రికార్డ్స్‌లో ఉంది. అయితే 2019లో తల్లి పేరు లక్షమ్మ అంటూ.. ఎస్సీ మాలగా దొంగ సర్టిఫికెట్ పెట్టి నమోదు చేశారు. అంతేకాకుండా ఎస్సీ కోటాలో నార్కెట్‌పల్లి కామినేని మెడికల్​ కాలేజీలో ప్రణవ్‌కు పోయిన సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. దీంతో డీఎంహెచ్‌వోపై ఎస్సీ ఐక్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గుండమల్ల మల్లేశ్​ ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఈ వ్యవహారంపై ఒక కమిటీ కూడా వేశారు. అడిషనల్ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఎస్సీ, బీసీ డెవలప్​మెంట్ ఆఫీసర్లు, DTWO సభ్యులుగా పెడుతూ DLSC కమిటీని ఏర్పాటు చేశారు. 

ఇది కూడా చదవండి: అందమైన అమ్మాయిలు ఉండే దేశాలు ఇవే

సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే హర్షవర్థన్‌కి చెందిన బీసీ(డీ) కులం మాత్రమే కాకుండా తల్లికి చెందిన ఎస్సీ మాల కులంపై నకిలీ సర్టిఫికెట్లు క్రియేట్‌ చేసినట్టు గుర్తించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు కమిటీ అందించింది. దీంతో ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేయడమే కాకుండా గెజిట్‌ కూడా విడుదల చేశారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. కావాలంటే కోర్టుకు వెళ్లొచ్చని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  గర్భిణులు ఉపవాసం చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇది కూడా చదవండి: 12 ఏళ్ళ తర్వాత తల్లి కాబోతున్న బాలయ్య హీరోయిన్.. బేబీబంప్ ఫొటోలు వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Komatireddy Raj Gopal Reddy : రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. వాళ్ల డిమాండ్ కూడా అదే..

గత కొంతకాలంగా తనకు మంత్రి వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన దూకుడు పెంచారు. ఎన్నికల సమయంలో తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అధిష్టానానికి స్పష్టం చేశాడు. ఆయనకు సొంత జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా జత కలిశారు.

New Update
 Raj Gopal Reddy

Raj Gopal Reddy

 Komatireddy Raj Gopal Reddy : గత కొంతకాలంగా తనకు మంత్రి వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన దూకుడు పెంచారు. ఎన్నికల సమయంలో తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అధిష్టానానికి స్పష్టం చేశాడు. అంతేకాదు ఆయనకు సొంత జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా తోడవ్వడంతో ఆయన మంత్రి పదవి ఆసక్తికరంగా మారింది.చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సీటు గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తా. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుంది’ అని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

 ఇక ఆయనకు మద్దతుగా మాట్లాడిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,  భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. మేమంతా రాజగోపాల్ రెడ్డి కోసం ఎక్కడ సంతకం చేయాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే పార్టీ, ప్రభుత్వం మరింత బలపడుతుందని మేము భావిస్తున్నామని అన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మీద విజన్, సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని తెలిపారు.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

వారితో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్  మాట్లాడుతూ.. ‘చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను పెద్ద పాపులర్ పర్సన్ కాదు. పార్టీలో కింది స్థాయి నుంచి కష్టపడితే పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. నా గెలుపును తన భుజాల మీద వేసుకొని గెలిపించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి లేకపోతే నా గెలుపు అంత సులువు అయ్యేది కాదు. తనను ఎంపీగా గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి క్రియాశీలక పాత్ర రాజగోపాల్ రెడ్డిది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లను ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి’ అని చామల కిరణ్ డిమాండ్ చేశారు. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

గత కొంతకాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నది. సామాజిక వర్గాల సమన్వయం, అన్ని జిల్లాలకు ప్రాథినిత్యం లభించాలనే కోణంలో కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ కు మంత్రుల ఎంపిక సవాలుగా మారింది. మరోవైపు జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

#minister #MLA Vemula Veeresham #chamala kiran kumar reddy #mla komatireddy rajagopal reddy #komatireddy rajagopal reddy speech #munugodu-politics
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు