/rtv/media/media_files/2025/03/24/CwwbW8c66sRZykNu1FUs.jpg)
sell peacock meat Photograph: (sell peacock meat)
కాసులకు కక్కుర్తి పడిన ఓ వ్యక్తి జాతీయ పక్షి నెమలిని చంపి పరారీలో ఉన్నాడు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేందుకు కొందరు వెనకాడుతున్నారని నెమలి మాంసం అమ్మాలని అనుకున్నాడు. జాతీయ పక్షి నెమలి మాంసాన్ని అమ్మడానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం బయటకు పోక్కడంతో పోలీసుల దాకా చేరింది.
Also read: Eknath Shinde: ఏక్ నాథ్ షిండేపై జోక్స్.. కమీడియన్‌పై కేసు నమోదు
విషయం తెలుసుకున్న వేములపల్లి పోలీసులు నిందితుడు నిమ్మల రమేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జాతీయ పక్షిని చంపినందుకు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న నెమలి చంపి మాంసాన్ని అమ్మాడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది.
శెట్టిపాలెం గ్రామస్తుడు నిమ్మల రమేశ్ వ్యవసాయం, కుల వృత్తిలో భాగంగా వేట చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం రెండు నెమళ్లు, ఒక దుప్పి మాంసాన్ని తెచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం పోలీసులకు అందింది. వారు దాడి చేసి అతని నుంచి నెమళ్ల, దుప్పి మాంసం స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మాంసానికి పంచనామా నిర్వహించి, వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. కాగా సదరు నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే కాని పూర్తి వివరాలు తెలియరావని పేర్కొన్నారు.
Also read: Rajahmundry Event anchor: అక్రమ సంబంధంలో అనుమానం.. తల్లీకూతుళ్లను పొడిచి చంపిన యువకుడు