/rtv/media/media_files/2025/03/15/eZxefbuOXArH4Mzjk0QM.jpg)
suspension of MLA Photograph: (suspension of MLA)
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy) పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ (BRS) శాసనసభా పక్షం స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల సీనియర్ శాసన సభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ (Harish Rao) రావు అన్నారు.
సస్పెన్షన్ పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, సస్పెన్షన్‌కు గురైన జగదీశ్ రెడ్డి వివరణ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వారు ఆరోపించారు.
Also Read : హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
గురువారం అసెంబ్లీ సమావేశంలో సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడారు. సభ మన అందరిది, సభ మీ ఒక్కరిది కాదంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి కామెంట్స్‌పై స్పీకర్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌తో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.
Also Read : ట్యాక్సీ డ్రైవర్‌తో కూతురు వివాహం.. తండ్రి, సోదరుడు అతికిరాతంగా ఏం చేశారంటే?
BRS Leaders - Suspension Of MLA
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి
— Telugu Scribe (@TeluguScribe) March 15, 2025
స్పీకర్‌ను విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు https://t.co/D6tayvujqJ pic.twitter.com/raJvFazn5n
Also read: TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి
సస్పెన్షన్ పై నిర్ణయాన్ని పునర్‌పరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ శాసన సభ సమావేశంలో గవర్నర్ ప్రసంగాని తిర్మానం తెలిపిన రోజు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ పట్ల అమర్యాదగా మాట్లాడారని సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. శనివారం తెలంగాణ అసెంబ్ల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి.
Also read: Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్