కొడుకుని మింగిన ఆన్ లైన్ బెట్టింగ్.. దారుణానికి పాల్పడ్డ తల్లి! రంగారెడ్డి జిల్లాకి చెందిన అఖిల్‌రెడ్డి ఆన్‌లైన్ ట్రేడింగ్ లో రూ.20 లక్షలు నష్టపోయాడు. దీంతో అప్పుల బాధ తట్టుకోలేక ఉరేసుకుని చనిపోయాడు. కుమారుడి మరణంతో తల్లి లూర్దమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. By Seetha Ram 05 Oct 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి ఆన్ లైన్ బెట్టింగ్ లు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. లక్షల్లో బెట్టింగ్ లు ఆడి నష్టపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. ఓ యువకుడు ఆన్లైన్ ట్రేడింగ్లో దాదాపు లక్ష రూపాయలు పెట్టాడు. లాభాలు వస్తాయని ఎంతో ఆశ పడ్డాడు. కానీ అది కాస్త బెడిసి కొట్టడంతో నష్టాలపాలయ్యాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణ వార్త విన్న తల్లి మనసు విలవిలలాడిపోయింది. దీంతో ఒక్కగానొక్క కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చదవండిః ఆన్ లైన్ బెట్టింగ్ కు రెండు కుటుంబాలు బలి.. హయత్‌నగర్ సూర్యనగర్ కాలనీ రోడ్డునంబరు-2లో తాటికొండ లూర్దమ్మ, శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు అఖిల్‌రెడ్డి(24). వీరంతా కలిసే జీవిస్తున్నారు. ఉద్యోగ రీత్యా అఖిల్ తండ్రి శ్రీనివాస్‌రెడ్డి సివిల్ కాంట్రాక్టర్. తల్లి లూర్దమ్మ సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పారామెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అఖిల్ రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేశాడు. అప్పటి నుంచి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. రూ.20 లక్షల మేర నష్టం మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కొన్నాళ్లుగా భారీగా నష్టపోతూ వస్తున్నాడు. సుమారు రూ.20 లక్షల మేర నష్టపోయాడు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. ఏం చేయాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. అనంతరం గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మధ్యాహ్న సమయంలో అతడి తల్లి ఫోన్‌చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కాకపోయే సరికి.. అదే ఇంట్లో అద్దెకుంటున్న వారికి కాల్ చేసి మాట్లాడింది. వారు వెళ్లి చూసేసరికి అఖిల్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. దీంతో ఒక్కగానొక్క కుమారుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక తల్లి లూర్దమ్మ గురువారం అర్ధరాత్రి బాత్‌రూమ్ శుభ్రం చేసే కెమికల్ ని తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. Also Read : రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ఆ కేసులో పుణె కోర్టు సమన్లు! #scam #online-betting #trading మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి