/rtv/media/media_files/2025/03/10/Eu9xmAlj7RiVZ7spXYku.jpg)
Most Wanted Cheater
Most Wanted Cheater :కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్స్‌ను టార్గెట్ చేస్తూ ఇంటీరీయర్ డిజైనర్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న మోస్ట్ వాంటేడ్ చీటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన నోటోరియస్ చీటర్ పలాష్ పాల్ నారాయణ గూడ పోలీసులకు చిక్కాడు.పలాష్ ఇంటీరియర్ డిడైనర్ పేరుతో పలువురిని మోసం చేయగా ఆయన గురించి గత కొంతకాలంగా పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో పలాష్ మోసలకు అడ్డుకట్టపడినట్లయింది.
ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ
పలాష్ ఇంటీరియర్ డిజైనర్ నంటూ పరిచయం చేసుకుంటాడు. తన మాటలతోనే మనుషులను బుట్టలో వేసుకుంటాడు. ఫేక్ వీడియోస్ చూపిస్తూ నమ్మిస్తాడు. నమ్మి చేతిలో డబ్బలు పెట్టామా ఇక కంటికి కనిపించడు. ఫోన్లలోనూ అందుబాటులో ఉండడు. అప్పుడు తెలుస్తోంది తాము మోసపోయామని. అలా అతడి మాయ మాటలు నమ్మి మోసపోయినవారు ఎందరో. కానీ ఇన్నాళ్లకు అతడి పాపం పండింది.ఎట్టకేలకు అరెస్ట్ అయి కటకటాలపాలయ్యాడు.
ఇది కూడా చదవండి: జుట్టు పెరగాలంటే బీట్రూట్ను ఇలా ఉపయోగించండి
పశ్చిమబెంగాల్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ చీటర్ పలాష్ పాల్‌ను నారాయణ గూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్స్ టార్గెట్‌గా పలాశ్ మోసాలకు పాల్పడ్డాడు. ఇంటీరియర్ డిజైనర్‌నంటూ సైట్స్ ఎండ్ కన్స్ట్రక్షన్ ఓనర్స్‌కు తనను తాను పరిచయం చేసుకుని పరిచయం చేసుకుంటాడు. ఇంటీరియర్ డిజైన్స్ సంబంధించి ఫెక్ వీడియోస్ చూపించి వర్క్ చేస్తానంటూ అందినకాడికి డబ్బులు వసూలు చేశారు. తీరా డబ్బులు చేతిలో పడ్డాక ఓనర్స్ కాల్స్‌కు స్పందించడు. అంతేకాకుండా నిందితుడు పలాశ్ పాల్‌పై ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కేసుకు కూడా నమోదు అయ్యింది. మర్డర్ కేసు సంబంధించి కోర్ట్ పేషీలకు పలాశ్ హాజరుకాలేదు. దీంతో పలాశ్ పాల్‌పై ఎన్‌బీడబ్ల్యూ వారెంట్‌ను న్యాయస్థానం జారీ చేసింది.
పలాశ్ పాల్‌పై ఎస్ఆర్‌నగర్, నారాయణగూడా, శంషాబాద్, రాయదుర్గ్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. నారాయణగూడలో నికిత్ రెడ్డి వద్ద కార్పెంటర్, వుడ్ వర్క్స్ కోసం అంటూ దాదాపు రూ.66 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్నాక వాట్సాప్, నార్మల్ కాల్ అందుబాటులో లేకపోవడంతో నిఖిత్ రెడ్డి అప్రమత్తమయ్యాడు. పలాశ్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని అకౌంట్‌లో ఉన్న రూ. 18,65,000 బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. పలాశ్ పాల్ కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు.. చివరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పలాశ్ వద్ద నుంచి 120 గ్రాముల బంగారం, 40 వేల రూపాయల కాష్, పలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్, మొబైల్ ఫోన్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.
Also read: jagga reddy: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్‌లో