హైదరాబాద్ నుంచి యాదాద్రికి త్వరలో ఎంఎంటీఎస్ సేవలు: కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సందర్శించారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. By B Aravind 20 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం ఆ టెర్మినల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో నిర్మాణం చేశామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెలంగాణకు రైల్వేల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పారు. కొత్త రైల్వే నిర్మాణంలో కేంద్రం అభివృద్ధి చేస్తుందన్నారు. Also Read: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది? 98 శాతం పూర్తయ్యాయి హైదరాబాద్‌లో ఇప్పటికే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు చర్లపల్లి నాలుగో కొత్త రైల్వే స్టేషన్ రాబోతుందని తెలిపారు. దీనివల్ల హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రధాని నేతృత్వంలో ఈ రైల్వే స్టేషన్‌ను తక్కువ సమయంలో నిర్మించామని.. ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు రూ.430 కోట్లు ఖర్చు చేసి నిర్మించినట్లు తెలిపారు. రైల్వే్ట్రాక్ నిర్మాణంతో పాటుగా కొత్త టెక్నాలజీతో అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. దివ్యాంగులకు, వృద్ధులకు మెట్లు ఎక్కేందుకు ఎస్కలెటర్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే? రోడ్ల కనెక్టివిటీ కావాలి ఇక చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. భరత్‌నగర్, మహాలక్ష్మీనగర్ వైపున 80 అడుగుల మేర రోడ్లు కావాలని.. వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ అయిందని దాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. పూర్తిస్థాయిలో ఇక్కడి నుంచి రోడ్ల కనెక్టవిటీ ఉన్నప్పుడే ఉపయోగం ఉంటుందని తెలిపారు. Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే? మరోవైపు తెలంగాణలో రైల్వే ప్రమాదాలు జరగకుండా ప్రధాని మోదీ రైల్వే కవచ్ వ్యవస్థను తెలంగాణలో ప్రవేశపెట్టారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. వందేభారత్ రైళ్లు ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ ట్రైన్‌లలో త్వరలోనే స్లీపర్ కోచ్‌లు కూడా ఏర్పాటుచేస్తామన్నారు. ఇక తెలంగాణలో అమృత్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని.. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రూ.429 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్, రూ.430 కోట్లతో చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.521 కోట్లతో రైల్ మ్యానుఫాక్చర్ యూనిట్‌ను ప్రారంభించామన్నారు. Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా.. #telugu-news #telangana #mmts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి