/rtv/media/media_files/2025/04/01/ChNhz8MsCdYjAxvMkLnf.jpg)
MLA Payal Shankar Fires On CM Revanth Reddy
MLA Payal Shankar : హెచ్సీయూ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మంగళవారం హెచ్సీయూకు వెళతామని బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. దీంతో హైదర్‌గూడ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు మోహరించారు. పలువురు బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హెచ్సీయూకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాగా తమను అరెస్ట్ చేయడం పై బీజేపీ ఎమ్మెల్యేలు రేవంత్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, ఆస్తులు అన్నీ అమ్ముకుంటూ పోతే.. హైదరాబాద్ విశ్వనగరంగా ఎలా మారుతుందని ప్రశ్నించారు. గత సీఎం కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని.. అసలేం మారలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.. ఇప్పుడు ఆయన కూడా అదే పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ దోచుకోగా.. మిగిలిన సంపదను కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు.
Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!
భూములను రక్షించడం ప్రభుత్వ బాధ్యత కానీ.. అమ్ముకోవడం కాదని అన్నారు. తక్షణమే భూములు అమ్ముకోవాలన్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు.. ఇది ప్రజాపాలనా? లేక నియంత పాలనా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రమాదమే అని.. ఈ రెండు పార్టీల వైఖరిలను ప్రజలు గమనించాలని కోరారు. భవిష్యత్‌లో ఈ భూములన్నీ అమ్ముకొని.. రేవంత్ రెడ్డి ఇటలీ పారిపోవడం ఖాయమని మరో బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. హెచ్‌సీయూ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Also Read: TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!