/rtv/media/media_files/2025/01/30/tIcPJNmCAiY2nDX8hRA1.webp)
MLA PARNIKA REDDY
MLA Chittem Parnika Reddy : అటెండర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఒక మహిళను ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. ఎమ్మెల్యే సంతకం ఉంటే ఉద్యోగం గ్యారంటీ అంటూ ఒక మహిళను నమ్మించాడు. దానికోసం ఏకంగా నకిలీ లెటర్ ప్యాడ్ తయారు చేసి దానిపై తానే సంతకం చేసి మహిళకు ఇచ్చాడు. ఆ సంతకం నకిలీది అని తేలడంతో కటకటాల పాలయ్యాడు.
Also Read: Local Bodie Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..
నారాయణ పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి ఒక నిందితుడు షాక్ ఇచ్చాడు. ఏకంగా ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి గురుకుల పాఠశాలలో అటెండర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేశాడు. గురుకుల పాఠశాలలో ఉన్న అటెండర్ పోస్ట్ కోసం ఒక మహిళా మక్తల్ నియోజకవర్గంలోని నర్వకు చెందిన ఓ వ్యక్తిని సంప్రదించింది. దీంతో సదరు వ్యక్తి అందుకోసం ఏకంగా నారాయణపేట ఎమ్మెల్యే ఫేక్ లెటర్ ప్యాడ్‌పై ఎమ్మెల్యే సంతకాన్ని సైతం ఫోర్జరీ చేశాడు. ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి సంతకం ఫోర్జరీ జరిగిన విషయం బయటకు లీకైంది.దీంతో పై స్థాయి నుంచి అధికారులు విచారణ ప్రారంభమైంది. దీనిలో భాగంగా మక్తల్ నియోజకవర్గంలోని నర్వకు చెందిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. అతని నుంచి ఫోర్జరీకి వాడిన వస్తువులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరికల్ గురుకుల పాఠశాలలో ఓ మహిళకు అటెండర్ పోస్ట్ ఇప్పించేందుకు ప్రయత్నించిన నిందితుడు గతంలో గురుకుల పాఠశాలలో పనిచేసినట్లు గుర్తించారు.
Also Read : దొంగగా మారిన ఐటీ ఎంప్లాయ్.. కొలీగ్ ఇంటికి వెళ్లి అతని భార్యను..
అయితే అటెండర్ పోస్టు ఇప్పిస్తానని సదరు వ్యక్తి మహిళా వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ప్రచాం సాగుతోంది. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు . కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో… నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చిట్టెం పర్ణికా రెడ్డి విజయం సాధించారు.
Also Read : రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం