Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి సైబర్ టోకరా: లక్ష రూపాయలు మాయం

సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా ఇప్పుడు చదువుకున్న వారిని, ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా  జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఈ సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు.

New Update
palla

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy: సైబర్ నేరగాళ్లు(Cyber ​​Crime) సామాన్య ప్రజలనే కాకుండా ఇప్పుడు చదువుకున్న వారిని, ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా  జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఈ సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ఆదివారం ఉదయం ఆయనకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను తెలంగాణ ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శి అనంతరామిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్  పథకం కింద అర్హులైన వారికి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యేను నమ్మించాడు.

Also Read: “మాస్... మాస్... మాస్...” “రాకా” ఫస్ట్ లుక్ పోస్టర్ పై షారుక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

జనగామ నియోజకవర్గం నుంచి ఒక 40 మంది లబ్ధిదారుల జాబితాను పంపిస్తే, వారికి వెంటనే లోన్లు మంజూరు చేయిస్తానని ఆ వ్యక్తి హామీ ఇచ్చాడు. తన నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ ప్రతిపాదనకు అంగీకరించారు. అయితే, ఆ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అదే చివరి రోజని నమ్మించిన సదరు వ్యక్తి, ఒక్కో లబ్ధిదారుడికి 2,500 రూపాయల చొప్పున మొత్తం 40 మందికి కలిపి లక్ష రూపాయల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సూచించాడు. ఆ వ్యక్తి మాటలను పూర్తిగా విశ్వసించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంటనే ఫోన్ పే ద్వారా లక్ష రూపాయలను ఆ వ్యక్తి చెప్పిన నంబర్‌కు పంపించారు.

Also Read: అమెరికా vs ఇరాన్ .. యుద్ధం డిమాండ్స్ ఏంటి?

పోలీసులు కేసు నమోదు చేసి

డబ్బులు అందిన కొద్దిసేపటికే, సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అందలేదని, మరోసారి పంపాలని ఆ వ్యక్తి మళ్ళీ అడగడంతో ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆరా తీయగా, అసలు ఆ పేరుతో అలాంటి ఉద్యోగి ఎవరూ లేరని, అది సైబర్ మోసమని తేలింది. మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు