ఐకాన్ స్టార్ అల్ల అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందే దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతున్న మొదటి భారతీయ సినిమాగా మరో ఘనత సాధించింది. పుష్ప-2 ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన సినిమా అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంపై తెలంగాణకు చెందిన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. సినిమాలో ఎర్రచందనం ధర గురించి చూపించిందంతా అబద్ధమని తెలిపారు. Also read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్ కంపెనీ.. '' ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఈ చెట్లను యువత నరికేశారు. ఇప్పుడు పుష్ప-2 (Pushpa-2) కి ఇంకెన్ని చెట్లు నరికేస్తారో ?. యువత సినిమా వల్ల చెడిపోతుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్‌ను అరెస్టు చేయాలి. సినిమాను నిలిపివేయాలని'' ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. అలాగే తాను కూడా ఎర్రచందనం వ్యాపారినేనని పేర్కొన్నారు. Also Read: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు! రాకేశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పుష్ప-2పై ఏపీకి చెందిన గన్నవరం నియోజకవర్గ జనసేన నేత చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే పుష్ప-2 సినిమాను ఏపీలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉండగా.. గురువారం పుష్ప-2 నడుస్తున్న థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. సినిమాను చూసేందుకు అల్లుఅర్జున్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు క్యూలు కడుతున్నారు. Also Read: పురుషులకు నెలసరి వస్తే తెలిసేది.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు Also Read: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు!