Adluri Laxman : నిరూపిస్తే రాజీనామా చేస్తా.. హరీష్‌రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సవాల్

హరీష్ రావు చేసిన కామెంట్స్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం, కోడిగుడ్ల సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ హరీశ్ రావు చేసిన ఆరోపణలు చేశారు.

New Update
adluri

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన కామెంట్స్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం, కోడిగుడ్ల సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ హరీశ్ రావు చేసిన ఆరోపణలు చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లకు అసలు తమ డిపార్ట్‌మెంట్‌లలో ఏం జరుగుతుందో కూడా తెలియని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు.  యూనిఫాంలు, టైల కోసం రూ. 1200 కోట్ల టెండర్ పిలిస్తే, ఉప్పులు, పప్పులు, చికెన్ కోసం రూ.800 కోట్ల టెండర్ పిలిచారు.. రెండు కలిపితే రూ.2000 కోట్లన్నారు. టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే మీరు ఏం పాలన చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని హరీశ్ రావు అన్నారు. 

రాజీనామా చేస్తా

అయితే హరీష్ ఆరోపణలపై మంత్రి లక్ష్మణ్‌ తీవ్రంగా స్పందించారు. గురుకులాల టెండర్లలో రూ.2 వేల కోట్ల స్కాం జరిగిందని నిరూపించాలంటూ హరీశ్ రావుకు బహిరంగ సవాల్ విసిరారు.  రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తా. ఇందుకు సంబంధించిన చర్చకు వేదిక ఎక్కడో నువ్వే చెప్పు.. నేను, నా శాఖకు సంబంధించిన అధికారులందరం అక్కడికి వస్తాం. ఒకవేళ నువ్వు నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతావా హరీష్‌రావు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సవాల్ విసిరారు.  మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హరీశ్ రావు ఆరోపణలను కొట్టిపారేశారు. అసలు తాము టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన మొత్తమే చాలా తక్కువగా ఉంటే, వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు