Medigadda : అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు.. విజిలెన్స్ రిపోర్ట్

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై విజిలెన్స్ నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి. నాణ్యత పరీక్షలు చేయకుండానే పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు సృష్టించి అధికారులు మోసం చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆక్షేపించింది.

author-image
By srinivas
New Update
telangana

MEDIGADA : కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై విజిలెన్స్ నివేదికలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. లీకేజీపై కొన్ని పరీక్షలు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో రాయడం సంచలనం రేపుతోంది. నాణ్యత పరీక్షలు చేయకుండానే పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు సృష్టించి అధికారులు మోసం చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆక్షేపించింది. ఇందుకు బాధ్యులైన ఇంజినీర్లు, గుత్తేదార్లపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఫార్సు చేసింది.

Also Read :  చిత్తూరు రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం.. ఎంతంటే ?

పరీక్షలు చేయకుండా బిల్లుల చెల్లింపు..

ఈ మేరకు ఎలాంటి పరీక్షలు చేయకుండా బిల్లులు చెల్లించడానికి అనుమతించారని తెలిపింది. ఇంజినీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని స్పష్టం చేసింది. 3,26,550 క్యూబిక్‌ మీటర్ల పనికి కంప్రెసివ్‌ స్ట్రెంగ్త్‌ పరీక్షలు జరగలేదు. కాంట్రాక్టర్‌తో ఇంజినీర్లు కుమ్మక్కై బ్యాంకు గ్యారంటీలను తిరిగి చెల్లించడం.. పని పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. డీవాటరింగ్‌కు సంబంధించిన రికార్డులే లేవు. కానీ అంచనా మాత్రం భారీగా పెంచారని విజిలెన్స్ నివేదిక పేర్కొంది.

Also Read :  తెనాలిలో గంజాయి ముఠా అరెస్టు.. సీక్రెట్ గా ప్యాకెట్లలో..!

నాణ్యత, రక్షణ రికార్డులు లేవు..

ఇక 2019 సెప్టెంబరు 9న బి.వి.రమణారెడ్డి దాదాపు పని పూర్తయినట్లు సర్టిఫికెట్‌ జారీ చేశారని తెలిపింది. సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ కె.సుధాకర్‌రెడ్డి అండర్‌ టేకింగ్‌ తీసుకోకుండానే కౌంటర్‌ సంతకం చేశారని, నాణ్యత, రక్షణ ప్రమాణాలకు సంబంధించిన రికార్డులు ఏవీలేవని చెప్పింది. నోట్‌ ఫైల్‌ కూడా ప్రాసెస్‌ చేయలేదని, ఈఈ, ఎస్‌ఈ.. ఇద్దరూ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైనట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వెల్లడించింది. ఎస్‌ఈ కూడా ఏమీ పట్టించుకోకుండా కౌంటర్‌ సంతకం చేయడంపై కూడా విచారం వ్యక్తం చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు.. నీటిపారుదల శాఖ సైతం ఎలాంటి వివరాలేవీ లేకుండా ధృవీకరణ పత్రం జారీ చేసినట్లు తెలిపారు. దీంతో బ్యారేజీకి నష్టం వాటిల్లిందని, పని పూర్తయిన తర్వాత కాఫర్‌డ్యాం, దాని అనుబంధ షీట్‌పైల్స్‌ను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పింది. రోజుల క్రితం కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జ్యుడిషియల్‌ కమిషన్‌కు ఈ నివేదిక అందజేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌... తాజాగా ప్రభుత్వానికి కూడా సమర్పించినట్లు సమాచారం.

Also Read :  కీలక పదవులు టీడీపీకే.. మరి జనసేనకు!

'EE, SE కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా LT- PESకు ప్రయోజనం చేకూర్చారు. ఈఈ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. SE కూడా పట్టించుకోకుండా కౌంటర్‌ సంతకం చేశారు. డాక్యుమెంట్లు, ఎం.బుక్‌లు, నాణ్యత తనిఖీ రికార్డులు.. వివరాలేమీ లేకుండానే ధ్రువీకరణ పత్రం ఇచ్చిన నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు కూడా క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు అర్హులుగా పేర్కొంది విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌.

Also Read :  నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు