మేడిగడ్డ ఇంజినీర్లకు బిగ్ షాక్.. ఏసీబీ చట్టం కింద కేసులు! మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూలో భాగస్వాములైన అవినీతి ఇంజినీర్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సూచనల మేరకు వారిపై ఏసీబీ చట్టం కింద కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పదోన్నతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోనుంది. By srinivas 24 Sep 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Medigadda: కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూలో భాగస్వాములైన ఇంజినీర్లకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. బ్యారేజీ దెబ్బతిన్న పనులు పూర్తి చేస్తామని అండర్‌టేకింగ్ తీసుకోకుండానే పని పూర్తైనట్లు సర్టిఫికెట్ ఇచ్చినందుకు ఏసీబీ చట్టం కింద కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వారి తప్పిదం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతినడంతోపాటు భారీగా ఆర్థిక నష్టం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పేర్కొంది. అలాగే నిర్మాణ సంస్థకు ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన దస్త్రాలన్నింటినీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు అందజేయాలని నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను రాహుల్ ఆదేశించారు. చట్టాలకు అతీతంగా నిర్ణయాలు.. ఈ మేరకు జులైలో ఈ ఇష్యూపై ఆదేశాలు జారీ చేసినప్పటికి దస్త్రాలు కమిషన్‌కు చేరలేదని, దీంతో మరోసారి మెమో జారీ చేసినట్లు రాహుల్ తెలిపారు. ఆ మెమోను ఓఅండ్‌ఎం, గజ్వేల్ ఈఎన్సీ, రామగుండం, సీడీవో, క్వాలిటీ కంట్రోల్ సీఈలకు పంపినట్లు చెప్పారు. ఇక బ్యారేజీల నిర్మాణాల్లో కొందరు ఇంజినీర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, చట్టాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు విచారణలో కమిషన్ గుర్తించింది. వారందరిపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పలువురు ఇంజినీర్లను జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ చివరలో మాజీ ఈఎన్సీలు, ఉన్నతాధికారులను కమిషన్ విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. క్వాలిటీ కంట్రోల్, కన్‌స్ట్రక్షన్ విభాగాలకు చెందిన డీఈఈ, ఏఈ లను కూడా విచారించనుంది. విష్ణుప్రసాద్, అజ్మల్‌ఖాన్, సత్యనారాయణ గౌడ్, ఓంకార్ సింగ్, కరుణాకర్ తోపాటు విశ్రాంత ఇంజినీర్ సత్తిరెడ్డి మంగళవానం కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు. భవిష్యత్తులోనూ పదోన్నతులు ఇవ్వకుండా చర్యలు.. ఇక ఇప్పటికే ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలు, ప్రభుత్వ కార్యదర్శులు, మాజీ కార్యదర్శులతో సమావేశమైన కమిషన్.. వారి నుంచి 80 అఫిడవిట్లలో ఆధారాలు సేకరించింది. ఇందులో సమాచారం ఆధారంగా జాబితా రూపొందించనుంది. అయితే కొంతమంది అఫిడవిట్ల సమాచారానికి భిన్నంగా జవాబులు చెప్పినట్లు కమిషన్ గుర్తించింది. దీంతో వారందరిపై అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని భావిస్తోంది. అంతేకాదు భవిష్యత్తులోనూ వారికి పదోన్నతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో ఇంజినీర్లు నిర్వహించిన పాత్రను వెల్లడించే ప్లేస్‌మెంట్ రిజిస్టర్లు, కాంట్రాక్లర్ల చెల్లింపులు, పని పరిమాణం తెలిపే ఎంబీ బుక్స్ తమకు ఇవ్వాలని ఇంజినీర్లను కమిషన్ ఆదేశించింది. నాణ్యత నిర్వహణను పర్యవేక్షించిన ఇంజినీర్లు రిజిస్టర్లలో ఎన్నిసార్లు ప్లేస్‌మెంట్ సంతకాలు చేశారనే అంశంపై స్పష్టత రిజిస్టర్లు సమర్పించాలని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఆడిట్ అధికారుల నుంచి వివరాలు సేకరించాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. #medigadda #kaleshwaram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి