KCR: సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్.. విచారణ వాయిదా
TG: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. విచారణకు సమయం లేకపోవడంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
TG: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. విచారణకు సమయం లేకపోవడంతో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
TG: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మభ్యపెట్టిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఆంక్షలు పెట్టారని ఫైర్ అయ్యారు. రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని అన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ ప్రజల్లో మంచి పేరున్న నాయకుడని కొనియాడారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఆయన బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. అయితే హరీష్ బీజేపీలోకి వస్తే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి రావాలని సూచించారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు రఘునందన్ రావుకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
హైదరాబాద్ లోని నిజాంపేటలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా రోడ్డుపైకి తన పెంపుడు కుక్కలను వదలడంతో అవి చెలరేగిపోయాయి. స్కూల్ లో ఉన్న పిల్లలకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్న ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశాయి. ఈ ఘటనలో అతని చేయి విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి.
మెదక్ జిల్లాలోని ఓ సాంఘిక గురుకుల హాస్టల్ లో ఎలుకలు కొరకడంతో 12 మంది విద్యార్థినులు గాయపడ్డారు.బుధవారం రాత్రి 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. విషయం తెలిసి విద్యార్థినుల తల్లిదండ్రులు గురువారం హాస్టల్‌కు చేరుకుని సిబ్బందిని ఈ విషయం గురించి నిలదీశారు.
బషీర్ బాగ్ లోని పరిశ్రమ భవన్ లో TGIIC కార్పోరేషన్ చైర్ పర్సన్ గా నిర్మలా జగ్గారెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
TG: ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు హరీష్ రావు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే అని ధ్వజమెత్తారు.
TG: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం కానుంది. 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.