KCR: బీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో శుభకార్యానికి హాజరైన కేసీఆర్ దంపతులు-VIDEO
ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్ కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్ కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నిన్నటి మీటింగ్ లో కేసీఆర్ కొత్తగా చెప్పిందేమీ లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆయన స్వరంలో భయం కనిపించిందన్నారు. తొలిసారి కేసీఆర్ పేపర్ చూసి ప్రసంగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హరీష్ రావు BRS పార్టీలో కరివేపాకు లాంటోడని సెటైర్లు వేశారు.
చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరీకి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమన్నారు. దీంతో లింగనిర్ధారణ పరీక్షలు చేయించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్న మహిళకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని అనే మహిళ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది.
మెదక్‌లో మరో దారుణం జరిగింది. నామాపూర్‌లో మద్యానికిబానిసై వేధిస్తున్న జోగయ్యను భార్య నాగమ్మ తన కూతురి సాయంతో చంపేసింది. కూతురు కాళ్లు పట్టుకోగా నాగమ్మ గొంతుకు చీర చుట్టి కడతేర్చింది. నాగమ్మపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ‘భారత్ నెట్’ప్రాజెక్టులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనుంది. టీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ పనులు ప్రారంభించింది.
మెదక్ జిల్లా తూప్రాన్‌లో హల్దీవాగు దగ్గర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన మమత అనే తల్లి, తన ఇద్దరు చిన్నారులతో కలిసి వాగులో దూకింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మమతను స్థానికులు కాపాడారు.
మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో స్పాట్లోనే ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యంపై సూచనలు చేశారు. ఎమ్మెల్సీ కవిత, నేతలు తదితరులు పాల్గొన్నారు.