Telangana : మేడిగడ్డ వద్ద భారీ అగ్నిప్రమాదం..  క్యాంపు కార్యాలయంలో మంటలు!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

New Update
fire accident

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్యాంపు కార్యాలయంలో మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా మంటలు, పొగలు పైకి లేవడంతో అక్కడ ఉన్న సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అగ్నిమాపక శాఖకు సమాచారం

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రాజెక్టు సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం అసలు ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అలాగే ఈ ఘటనలో ఎంతవరకు ఆస్తి నష్టం సంభవించింది? అనే విషయాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు, అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisment
తాజా కథనాలు