Mallareddy College Crime: మల్లారెడ్డి కాలేజీలో మరో దారుణం.. బిల్డింగ్ నుంచి దూకబోయిన విద్యార్థిని-VIDEO

మేడ్చల్‌ మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ ఫస్ట్‌ఇయర్ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. క్యాంపస్ పరీక్షలు ఫెయిల్ అవుతాననే భయంతో 4వఫ్లోర్ కిటికీ నుండి దూకబోయింది. వెంటనే తోటివిద్యార్థులు ఆమెను కాపాడారు.

New Update
Malla reddy Womens Engineering College Student suicide attempt

Malla reddy Womens Engineering College Student suicide attempt

తెలంగాణలోని మల్లారెడ్డి కాలేజీ ఏదో ఒక ఘటనతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో ఘటనతో మల్లారెడ్డి కాలేజీ పేరు వార్తల్లోకెక్కింది. మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ - పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కీర్తి.. క్యాంపస్ పరీక్షలు ఫెయిల్ అవుతాననే భయంతో 4వ ఫ్లోర్ కిటికీ నుండి దూకబోయింది. దీంతో గమనించిన తోటి విద్యార్థులు ఆమె కిందపడకుండా పట్టుకుని కాపాడారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!

గర్ల్స్ హాస్టల్‌ బాత్రూంలో కెమెరాలు

ఇదిలా ఉంటే గతంలో కూడా మరికొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. గతంలో సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్‌ బాత్రూంలో కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. మొత్తం 300 వీడియోలు తీశారని విద్యార్థినులు తెలిపారు. 

Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

విద్యార్థునిల బాత్రూంలో వీడియోలను హాస్టల్‌లో పని చేస్తున్న సిబ్బందే తీశారని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి తెలుసునని..కావాలనే గోప్యంగా ఉంచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది మరువక ముందే వారం క్రితం మరో ఘటన జరిగింది.

వారం క్రితం మరో ఘటన

Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

మైసమ్మగూడ మల్లారెడ్డి మేనేజ్మెంట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థినికి కాలేజీ లెక్చరర్ అసభ్యకరమైన మెసేజ్​లు పెట్టాడు. ఎంబీఏ ఫ్యాకల్టీగా అయిన స్వామి అనే లెక్చరర్ విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించాడు. వాట్సాప్ ద్వారా ఆ విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు పెట్టి ఇబ్బందులు పెట్టాడు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. ఇలా తరచూ ఏదో ఒక ఇన్సిడెంట్‌తో మల్లా రెడ్డి కాలేజీ వార్తల్లో నిలుస్తోంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు