Latest News In Telugu Telangana Elections 2023 : కొల్లాపూర్ పర్యటనలో మార్పు.. ప్రియాంక స్థానంలో రాహుల్..!! నేడు కొల్లాపూర్ లో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగసభకు గెస్టుగా వస్తున్న ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయ్యింది. చివరి క్షణంలో ప్రియాంక టూర్ రద్దు అయినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రియాంక స్థానంలో సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. By Bhoomi 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 'అన్నా ఇటు వచ్చేయ్'.. నాగం జనార్థన్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్..! నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంతో ఆగ్రహంగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. త్వరలోనే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి, మంచి ముహూర్తం చూసుకుని గులాబీ కండువా కప్పుకుంటానని చెప్పారు. కాగా, నాగం జనార్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. By Shiva.K 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: హైదరాబాద్‌లో దారుణం.పెళ్లైన నెలకే భార్యను చంపి..భర్త ఏం చేశాడంటే? హైదరాబాద్ చంపాపేటలో దారుణం జరిగింది. పెళ్లైన నెల రోజులకే భార్యను అతి కిరాతకంగా చంపాడు ఓ భర్త. స్వప్నను కత్తితో దారుణంగా హత్యచేశాడు. భార్యను చంపిన ఆనంతరం తాను బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఈ సంఘటనతో చంపాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం భర్త ప్రేమ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్! కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ రోజు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. By Nikhil 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR: కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్: సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంట్ వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు జడ్చర్లలో జరిగిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మరో సారి బీఆర్ఎస్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు, దళితబంధు పథకాలు ఆగిపోతాయన్నారు. By Nikhil 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: వాళ్లిద్దరి ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా పోటీ.. హాట్ కామెంట్స్ చేసిన డీకే అరుణ కేసీఆర్, కేటీఆర్ నిండు ఆశీర్వాదంతోనే ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డికి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆచారి బలం తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం పంచుకోవాలనే ఓట్లు చీల్చాలనే దురుద్దేశంతో ఎమ్మెల్సీ కసిరెడ్డికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు డీకే అరుణ. By Shiva.K 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Politics: శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డు ప్లే చేసినా.. ఏ కార్డు ప్లే చేసినా ఓడించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చేశాడని.. అందుకే కేసు వేశామన్నారు. By Vijaya Nimma 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Srinivas Goud: అంతిమంగా ధర్మం గెలిచింది: శ్రీనివాస్ గౌడ్ కొంతమంది నాయకుల కుట్ర ఎన్నికల అఫిడవిట్ కేసు అని ఆరోపించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆయన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపధ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్టీవీ తో ఎక్స్‌క్లూజివ్ గా మాట్లాడారు. అంతిమంగా ధర్మం గెలిచిందని అన్నారు. నేను చేస్తున్న అభివృద్ది చూసి ఓర్వలేకే నాపై కేసులు వేయించారని విమర్శించారు. By Jyoshna Sappogula 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం School Bus: తెలంగాణలో స్కూల్‌బస్సు బోల్తా.. ఎంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయంటే..? మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. పిల్లలకు ఏమైనా జరుగుతుందేమో అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా ఆస్పత్రి దగ్గర చేరుకున్నారు. By Vijaya Nimma 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn