/rtv/media/media_files/2025/02/07/Ry9MI2T7KcrFzLg7ISGs.jpg)
Mahabubnagar Gurukul School Food poisoning
రాష్ట్రంలోని గురుకులాల్లో రోజు రోజుకు వైఫల్యం లోపిస్తోంది. విద్యార్థులకు భోజనం విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు. తరచూ ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికి చాలా ప్రాంతాల్లోని గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా హాస్పిటల్ పాలయ్యారు. తాజాగా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో అలాంటిదే మరొకటి జరిగింది.
ఫుడ్ పాయిజన్
గూడూరు మండలంలోని దామరవంచ తెలంగాణ సాంఘీక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి సాంబార్‌తో పాటు బొబ్బర్లు తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 16 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురికాగా.. మరో నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ తెలంగాణ సాంఘీక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్
— Telangana Awaaz (@telanganaawaaz) February 7, 2025
రాత్రి సాంబార్ తో పాటు బొబ్బర్లు తిన్న విద్యార్థులు. అందులో 16 మంది విద్యార్థులకు స్వల్ప అస్వస్థతకు గురికాగా.. నలుగురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గూడూరు మండల… pic.twitter.com/ENbKNgX53T
ఇది కూడా చూడండి: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
దీంతో గూడూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి వారిని తరలించారు. ఆ నలుగురు విద్యార్థులకు విపరీతమైన వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. వైద్యులు వెంటనే వారికి ట్రీట్మెంట్ అందించడంతో ప్రస్తుతం వారి పరిస్థితి పర్వాలేదని తెలుస్తోంది. అయితే ప్రిన్సిపల్, వార్డెన్ ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో విషయం తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే
ఇటీవల మరొకటి
ఇటీవల కామారెడ్డి - ఎల్లారెడ్డి పట్టణ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇలా జరగడానికి కారణం.. విద్యార్థులకు పచ్చడితో అన్నం పెట్టడమేనని తెలుస్తోంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన వెంటనే పాఠశాల సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారికి ఆసుపత్రిలో చికిత్స అందించారు.
సూర్యపేటలో
ఇలాంటిదే ఇటీవల రాష్ట్రంలో మరో ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. ఫుడ్ వికటించడంతో వసతి గృహంలో ఉంటున్న 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.