/rtv/media/media_files/2025/02/11/UY1uqQNQAOXuoo3uy2uv.webp)
Local Body Elections
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు విద్యాభ్యాసంపై ప్రభావం పడుతుందని, దీంతో వారు ఏకాగ్రత కోల్పోయి తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నదని సంఘం నాయకులు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ముగిశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అలాగే గత ఐదేండ్లలో గ్రామపంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి, వాటి తాలూకు బిల్లులు అందక సర్పంచ్‌లు ఆర్థికంగా కుదేలైపోయారని అన్నారు. వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి, ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతూ వినతి పత్రం అందించారు.
Also Read: మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే
ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకుండా వారిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సర్పంచులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఎన్నికలయ్యాక మాట మార్చడం సరికాదన్నారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి, ఎస్సీ వర్గీకరణలో తగు న్యాయం చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!
Also Read: పారిస్ ఏఐ సమ్మిట్.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ