KTR : కేటీఆర్ ను బట్టలూడదీసి కొడుతారు..పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు. కాంగ్రెస్‌ తల్లి, రాహుల్‌ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్‌ చేస్తామంటూ అహంకారంతో మాట్లాడుతున్నారు. దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చూడు కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.

New Update
pcc president mahesh goud and ktr

pcc president mahesh goud and ktr

KTR : కేటీఆర్‌కు అధికారం పోయి రోడ్డుమీద పడ్డా అహంకారం తగ్గలేదు.కాంగ్రెస్‌ తల్లి, రాహుల్‌ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్‌ చేస్తామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు. దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చూడు కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. గవర్నర్‌ ప్రసంగాన్ని అవమాన పరిచే విధంగా  కేటీఆర్‌ మాట్లాడ్డం ఆయన అహంకారానికి పరాకాష్ట అన్నారు. గవర్నర్‌కు  కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  గవర్నర్లను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదంటూ విమర్శించారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు సూచించారు.

Also read :  రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

Also Read :  చిత్తూరు లో దొంగల బీభత్సం...ఇంట్లో దూరి కాల్పులు!

రైతు రుణ మాఫీ లెక్కలు తెలియకుండా  కేటీఆర్‌ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం, మేడిగడ్డ నాణ్యత ఏంటో బయపడినా మళ్లీ వాటి గురించి మాట్లాడడం కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ఒక ఏటీఎంలా ఉపయోగపడిందన్నారు. కులగణనలలో తప్పుడు లెక్కలు చెబుతున్నామని అంటున్న మీరు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎందుకు బహిర్గతం చేయలేదు..? అని నిలదీశారు. కేసీఆర్ ఇప్పటికైనా ప్రతి పక్షనేతగా అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరై...ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తే బెటర్ అన్నారు.

Also Read :  హిందీలో 'ఛావా' కలెక్షన్ల జోరు.. 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్! ఎన్ని కోట్లంటే

 రైతు ఆత్మహత్యల గురించి కేటీఆర్ మాట్లాడటానికి సిగ్గుండాలి,  బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే రైతు ఆత్మహత్యలలో తెలంగాణ  రెండో స్థానంలో ఉండేది..బీఆర్ఎస్ పాలనలో రైతన్నలు వరికుప్పల మీద పడి చనిపోయిన ఘటనలు ఇంకా కళ్ళముందే కదలడుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దండుకుందని ఆరోపించారు. కుల గణన సర్వేలో పాల్గొనకుండా సర్వేను తప్పు పట్టే అర్హత కేటీఆర్ కు లేదని తేల్చి చెప్పారు. చారిత్రాత్మక నిర్ణయాలైన కుల గణన, ఎస్సీ వర్గీకరణ  చేసినందుకు అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడానికి సిగ్గుండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. పదేళ్ల పాలనలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసిన సన్నాసులు ఎవరో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో కేటీఆర్ అన్నారు. మీరు చేసిన అప్పులకే వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి పరాకాష్ట అన్నారు. వరంగల్ డిక్లరేషన్ హామీకి కట్టుబడి రైతు రుణ మాఫీ చేసాము, రైతు భరోసా ఇస్తున్నాం,  కాంగ్రెస్ రైతుల ప్రభుత్వం అని నిరూపించుకున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Also read :  కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు

Also Read :  War 2: వార్2 రిలీజ్ వాయిదా?.. షూటింగ్ లో స్టార్ హీరోకి గాయాలు!

Advertisment
Advertisment
Advertisment