KTR : కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌ సమావేశం లో కేటీఆర్ మాట్లాడారు.

New Update
 KTR

KTR

KTR  : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. మొన్నటి ఖమ్మం వరదల సమయంలో అక్కడి ప్రజలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చారని చెప్పారు. బర్త్ డే ఫంక్షన్లకు పోవడానికి హెలికాప్టర్లను ఉపయోగిస్తున్న మంత్రులు, ఖమ్మం వరదలప్పుడు మాత్రం హెలికాప్టర్లు పంపలేదని విమర్శించారు.

 ఇది కూడా చదవండి: BRS : టార్గెట్ సీఎం రేవంత్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద స్కెచ్!

ముగ్గురు మంత్రులున్నా ఉపయోగం లేదు

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనానికి ఓ కుటుంబం వదరల్లో కొట్టుకుపోయిందని కేటీఆర్ ఆరోపించారు. 2014 తర్వాత ఖమ్మంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి చేసిందని.. పువ్వాడ అజయ్‌లాంటి ఉత్సాహవంతమైన నాయకుడు ఓడిపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని.. ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాలతో బీఆర్‌ఎస్‌కు కొంత నష్టం జరిగిందన్నారు. ఓడిపోయినా కూడా ప్రజలకు కష్టం వస్తే బీఆర్ఎస్ నాయకులు గులాబీ దండు ఈ సంవత్సర కాలంగా ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఖమ్మంలో వరదలు వస్తే ప్రజలకు పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చాడని.. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదన్నారు.

ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

రేవంత్ రెడ్డికి రేషం లేదు

 ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదని.. ఎమ్మెల్యేల బర్త్‌డేలకు, పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరానికి కూడా హెలికాప్టర్లలో పోతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వచ్చినప్పుడు భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా నాలుగు హెలికాప్టర్లను పంపి ప్రజలను కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు ప్రాణం విలువ తెలుసునని.. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే ఖమ్మంలో మంత్రులు పర్యటించారన్నారు. ఖమ్మం వరదల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఓపెన్ టాప్ జీపులో చేతులు ఊపుతూ కాలు కింద పెట్టకుండా అటు ఇటు తిరిగి వెళ్లిపోయాడన్నారు. ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషం ఉన్న ఎవడైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని.. రేవంత్ రెడ్డికి రేషం లేదని.. కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతున్నాడని సెటైర్లు వేశారు.

ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!

బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది

బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని.. 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, సబ్ ప్లాన్ అమలు చేస్తామని.. రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని బీసీ జనాభాను తగ్గించిందని ఆరోపించారు. కేసీఆర్‌ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా 51.5శాతం ఉంటే.. రేవంత్‌ కుల గణన సర్వేలో ఐదున్నర శాతం తగ్గించి 46శాతానికి బీసీ జనాభాను చూపించారన్నారు. తెలంగాణలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉందన్నారు. సంవత్సర కాలంగా కేసులు పెట్టి వేధిస్తున్నా.. విచారణల పేరిట పిలిచి జైలులో పెడతామని బెదిరిస్తున్నప్పటికీ, ప్రజా సమస్యల మీద రేవంత్ రెడ్డితో కొట్లాడామన్నారు.

ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!

కాంట్రాక్టులన్నీ ఖమ్మం మంత్రికే..

తమ స్కూటీ ఏమైందని కాలేజీ పిల్లలు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టారని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని అనుకోని వర్గం ఏది ఈ రాష్ట్రంలో లేదన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉన్నారని తెలిపారు. సీఎం నియోజకవర్గంలోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతి పని కాంట్రాక్టు కూడా ఇవాళ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుందన్నారు. కాంట్రాక్టు మంత్రి, ఆయన కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని నిన్న కొడంగల్‌లో చెప్పానన్నారు. డిప్యూటీ సీఎం 30శాతం కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారని.. వ్యవసాయ మంత్రి రుణమాఫీ కాలేదని చెప్తే.. సీఎం మాత్రం మొత్తం రుణ మాఫీ అయ్యిందన్నారు.. ఇలా మంత్రులకు.. సీఎంకు శ్రుతి లేదన్నారు. ఫలితంగా తెలంగాణ అధోగతి పాలైందన్నారు.

ఇది కూడా చూడండి: Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?

హనీమూన్ టైం అయిపోయింది

కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైమ్‌ అయిపోయిందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్న ఓ మంత్రిని.. తులం బంగారం లేదని మహిళలు ప్రశ్నించారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుందని.. త్వరలోనే ఖమ్మం పర్యటనకు వస్తానని కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment