తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ను కలిసిన కేటీఆర్

మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువతో కప్పి  సత్కరించి.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు.

New Update
ktr governor

తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువతో కప్పి  సత్కరించి.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు. ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు.

కేసీఆర్ కు తుంటి విరిగినప్పుడు

కాగా కేసీఆర్ కు తుంటి విరిగినప్పుడు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్  రాష్ట్రం విడిపోయాక కూడా గవర్నర్ గా కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు  రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. మాజీ గవర్నర్ కృష్ణకాంత్‌ను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం పనిచేసిన గవర్నర్‌గా నిలిచారు నరసింహన్.

Also read :  KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bandi Sanjay :  ఎమ్మెల్సీ ఎన్నికలపై బండి సంజయ్ సంచలన కామెంట్స్

తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన నడుస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్.  రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బ్రష్టు పట్టిందన్నారు. ఢిల్లీ టెన్ జన్ పథ్ నుంచి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.

New Update
Bandi Sanjay Vs KCR

Bandi Sanjay Vs KCR

తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన నడుస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్.  రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బ్రష్టు పట్టిందన్నారు. ఢిల్లీ టెన్ జన్ పథ్ నుంచి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని విమర్శించారు.  సీఎం రేవంత్ కు, మంత్రులకు అసలు పాలనపై పట్టులేదన్నారు.  కాంగ్రెస్ పాలనలో ప్రతి పనికి కమిషన్లు,  అవినీతి నడుస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు! 

ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక కామెంట్స్

ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు.  దేశద్రోహులు, దేశభక్తుల మధ్య హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎంఐఎం గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరిస్తున్నాయని అన్నారు. మజ్లిస్ కంబధ హస్తల నుంచి హైదరాబాద్ ను కాపాడుతామని తెలిపారు సంజయ్.   హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని..  కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కేసుల నుంచి కాపాడుతుందని ఆరోపించారు.  

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Advertisment
Advertisment
Advertisment