కేటీఆర్‌పై ఏసీబీ విచారణ ముగిసింది. ఆరున్నర గంటల పాటు ఈ విచారణ సాగింది. ఫార్ములా- ఈ కార్ రేసు వ్యవహారంలో అధికారులు కేటఆర్‌ను ప్రశ్నించారు. ఈ కేసులో కేటీఆర్ పాత్ర గురించి వివరాలను ఆరా తీశారు. విచారణ ముగిసిన అనంతరం దీనికి సంబంధించి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. '' ఏసీబీ అధికారులు 82 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. నాకున్న అవాగాహన మేరకు సమాధానం ఇచ్చాను. వాళ్లకి అన్ని విధాలుగా సహకరించాను. విచారణకు ఎన్నిసార్లు పిలిచిన హాజరవుతానని చెప్పాను. ఇది ఒక చెత్త కేసు అని అధికారులకు కూడా చెప్పాను. అసంబద్ధమైన కేసులో ఎందుకు విచారిస్తున్నారని అడిగాను. అధికారులు కొత్త ప్రశ్నలు ఏమీ అడగలేదు. Also Read: తాత లేని జీవితం నాకొద్దు.. కంటతడి పెట్టిస్తున్న మనవడి సూసైడ్ నోట్! ఇది రాజకీయ కక్షపూరిత కేసు అని కూడా అధికారులకు చెప్పాను. పైసలు పంపాను అని నేనే చెబుతున్నాను. డబ్బులు వచ్చాయని వాళ్లు చెబుతున్నారు. ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంది. ఈ విషయాన్ని కూడా అధికారులను అడిగాను. ఫార్ములా సంస్థను విచారణకు ఎందుకు పిలవలేదని అడిగాను. నా ప్రశ్నలకు వారి నుంచి సమాధానం రాలేదు. నన్ను జైల్లో పెట్టించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. నన్ను జైల్లో పెట్టించాలని చూస్తే అది రేవంత్ ఖర్మ. అన్ని అంశాల్లో అవినీతి జరుగుతుందని రేవంత్ అవగాహన. రేవంత్‌ది పరిమిత స్థాయి, పరిమిత జ్ఞానం. ఫార్ములా ఈ- కార్ రేసింగ్‌ను కష్టపడి హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణను ప్రధాన స్థావరంగా మార్చేందుకే ఓ విజన్‌తో ఈ పని చేశాం. పైసలు, అవినీతి కోసం కాదు. ఇలాంట్ పనులు రేవంత్ చేస్తారు. మేము కాదు. ఈ విషయాన్ని కూడా ఏసీబీ అధికారులకు చెప్పాను. ప్రభుత్వం మాపై ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ సైనికులుగా ఈ ఏడాది మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడుతాం. పెన్షన్లు, 2 ఉద్యోగాలు, రైతు భరోసా, మహాలక్ష్మీ పథకం లాంటి అంశాల గురించే మాట్లాడుతాం. ఆరు గ్యారెంటీలపై మాట్లాడుతాం. ఇదొక లొట్టపీసు కేసని మళ్లీ మళ్లీ చెబుతున్నానని'' కేటీఆర్ అన్నారు. Also Read: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై పొంగులేటీ కీలక వ్యాఖ్యలు..