/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
KTR
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ అన్ని అబద్దాలు, అర్థ సత్యాలే మాట్లాడారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం కూడా రుణమాఫీ జరగలేదు కానీ.. రుణమాఫీ మొత్తం జరిగిందని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు.
Also read : రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
రేవంత్ అనే చేతకానీ సీఎం
రైతుబంధు మొత్తం అందిందని అసత్యాలు చెప్పించారని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు ఊరటనిచ్చేలా ఏ ఒక్క మాట కూడా లేదన్నారు. గురుకులాల్లో అధ్వాన్న పరిస్థితులపై కూడా ప్రస్తావించలేదని మండిపడ్డారు. రేవంత్ అనే చేతకానీ సీఎం వల్ల పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ పై గుడ్డి కోపంతో మేడిగడ్డ మరమ్మతులు చేయలేదని కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు. అటు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గవర్నర్ ప్రసంగం తరువాత వెళ్లిపోయారు.
Also Read : భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన
అంతకుముందు అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ రికార్డు సృష్టించిదని అన్నారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రసంగంలో వెల్లడించారు. అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని వెల్లడించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో సభను ఎన్ని రోజులు నడిపించాలో నిర్ణయిస్తారు. మార్చి19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Also Read : పోలీసులకు చుక్కలు చూపించాడు.. తప్పించుకుని ముప్పుతిప్పలు పెట్టిన ఖైదీ!
Also read : Kartik Aaryan: కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?