కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తారా.. కేటీఆర్

కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.  మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారన్నారు. కేసీఆర్ చేసిన అద్భుతమైన పనుల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

author-image
By srinivas
New Update
ktrrr

KTR: కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.  మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారన్నారు. కేసీఆర్ చేసిన అద్భుతమైన పనుల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

మీ నాటకాలు కొంతకాలమే..

ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భరతమాత రూపాన్ని వాజ్‌పేయీ అధికారంలోకి రాగానే మార్చలేదని చెప్పారు. అలాగే దేశంలో అధికార మార్పిడి జరిగినా ఇలాంటి పనులు ఎవరు చేయలేదని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగుతల్లి విగ్రహ రూపం మారుస్తున్నారని మండిపడ్డారు. 'కన్నడమాత విగ్రహం రూపు మారలేదు. కానీ, ఈ ముఖ్యమంత్రి.. కేసీఆర్‌ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగేళ్ల తర్వాత రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టిన స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. అధికారం ఉందని సాయుధ బలగాల నడుమ మీ నాటకాలు కొంతకాలం సాగుతాయి. కానీ, ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదు’ అంటూ తనదైన స్టైల్ వార్నింగ్ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి:  స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. సుఖ్‌బీర్ సింగ్‍పై హత్యాయత్నం

ఇక ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదని విమర్శించారు. యువతకు మిగిలింది విలాపమేనని, ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్‌ పబ్లిసిటీ చేసుకుంటుందని చెప్పారు. 55, 143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయి మాటలు చెబుతుందని, ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమే అన్నారు. 

ఇది కూడా చదవండి: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

ఇక ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు.. అధికారం వచ్చాక కూడా అబద్దాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. నిజం నిప్పులాంటిదని.. కాంగ్రెస్ మోసాలకు తెలంగాణ జవాబు చెబుతుందని చెప్పారు. జాగో తెలంగాణ యువత అంటూ పిలుపునిచ్చారు. నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ కు అధోగతే అన్నీరు. కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటామని, కాంగ్రెస్ ఇంకా 1,87,473 ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. 

ఇది కూడా చదవండి: Honey Trap: హనీ ట్రాప్‍ వల్లే వాజేడు SI సూసైడ్..!

ఇది కూడా చదవండి:మరోసారి తెరపైకి RS ప్రవీణ్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హరీష్ రావుకు షాక్!?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు