కేసీఆర్ సంచలన నిర్ణయం.. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి?

కేటీఆర్ అరెస్ట్ తర్వాత పార్టీ పగ్గాలు ఎవరందుకోబోతున్నారనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కవిత, హరీష్‌రావు లీడ్‌లో కనిపిస్తుండగా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కవితకే బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.  

author-image
By srinivas
New Update
ere

fd Photograph: (rer )

TG News : ఫార్ములా ఈ-కార్ రేస్ ఇష్యూలో కేటీఆర్ అరెస్ట్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. గురువారం ఏసీబీ కేటీఆర్ ను A1 నిందితుడిగా పేర్కొంటూ కేసు ఫైల్ చేయగా శుక్రవారం ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో.. బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కు పరిమితమవగా.. కేటీఆర్ ముందుండి పార్టీని నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు కేటీఆర్ అరెస్టు అయితే నెక్ట్స్ పార్టీని లీడ్ చేసేదెవరనేది చర్చనీయాంశమైంది. లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడిపొచ్చిన కవిత యాక్టివ్ అవుతున్నప్పటికీ ఆచితూచి అడుగేస్తున్నారు. మరోవైపు హరీష్ రావు తనవంతు పాత్ర పోషిస్తుండగా.. కేటీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు కేసీఆర్ ఎవరికి ఇస్తారనేది రాష్ట్ర రాజకీయాల్లో రకరకాల చర్చలకు దారితీస్తోంది.  

Also Read :  పవన్ కళ్యాణ్ అలాంటి వారే.. శ్రియా రెడ్డి షాకింగ్ కామెంట్స్!

అమెరికాకు కేసీఆర్..

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో అమెరికా వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే ఇదే సమయంలో కేటీఆర్‌ అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏమిటనేది పార్టీవర్గాలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు ప్రత్యామ్నాయంగా కవిత, హరీశ్‌ రావు ఉన్నప్పటికీ ఆ ఇద్దరూ పార్టీని సమర్ధవంతంగా నడిపించగలరా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం వారిద్దరిలో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంట్లో మౌనంగా ఉంటున్న కవితను ముందస్తు జాగ్రత్తతోనే రంగంలోకి దింపినట్లు పార్టీ వర్గాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read :  'ఇస్మార్ట్ జోడీ' లో కపుల్స్ సందడి.. ప్రోమోలో నిఖిల్, కావ్య..?

పబ్లిక్‌ సమస్యలపై కవిత యాక్టీవ్‌..

ఇటీవల కవిత అన్ని విషయాల్లోనూ యాక్టీవ్‌గా ఉంటున్నారు. మండలి సమావేశాల్లోనూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలపై బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. హామీల అమలు, తదితర అంశాలకు సంబంధించి రేవంత్ సర్కర్ పై ప్రశ్నలు సంధిస్తున్నారు. లగచర్ల ఘటనతోపాటు అదానీ అవినీతి, గురుకాలాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కూడా ఆమె తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్న కేటీఆర్ ఫార్ములా కార్ రేస్ అవినీతి ఆరోపణలపై అసెంబ్లీలో చర్చపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక తిహార్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా తనను ఇరికించిన వారి అంతు చూస్తామని, భారీ మూల్యం చెల్లిస్తానంటూ కవిత వార్నింగ్ ఇచ్చారు. అయితే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న కవితకు ఇదే అసలైన అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బిడ్డను మళ్లీ యాక్టివ్ చేసేందుకు కేసీఆర్ కూడా ఇదే సరైన సమయమని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.   

Also Read :  18ఏళ్ళ తర్వాత..పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్

అసెంబ్లీలో హరీష్ రావు.. 

బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీశ్‌రావు కూడా పార్టీ పగ్గాలు అందుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కేటీఆర్‌కు బదులు హరీశ్‌రావు ఫైట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. సర్పంచ్ ల బకాయి బిల్లులు, లగచర్ల ఘటన, కాళేశ్వరం, మేడిగడ్డ ఆరోపణలపై కూడా రేవంత్ సర్కారుకు ధీటుగా జవాబులిచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై కూడా పోరాడుతున్నారు. అంతేకాకుండా హరీష్ రావుపై ఇప్పటివరకు బలమైన అవినీతి ఆరోపణలు లేకపోవడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావుకు మద్ధతుగా ఉన్నట్లు లోలోపల గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో మొత్తగా కేసీఆర్, కేటీఆర్ తర్వాత బలమైన వాయిస్ వినిపించడంలోనూ హరీష్ రావు ముందుంటారు. కవిత జైలుపాలడం, ఇప్పుడు కేటీర్ పై అవినీతి ఆరోపణలు కూడా హరీష్‌ రావుకు ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. 

కవితకే కేసీఆర్ మొగ్గు..
ఇక పార్టీ విషయానికొస్తే.. కవితకే పగ్గాలు అప్పగించేందుకు కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఓటమితో అధికారం కోల్పోగా లోక్ సభ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం ఎదురైంది. కవిత జైలుపాలవడం, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంశంతో పార్టీ పూర్తిగా దివాలా తీసే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ప్రత్యామ్నయంగా కనిపిస్తున్నప్పటికీ పార్టీ హరీష్ రావు చేతికి అప్పగించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు. ఇలాంటి క్రైసిస్ సమయంలో హరీష్ రావుకు క్రెడిట్ దక్కితే తమకు ప్రమాదం ఉంటుందని, భవిష్యత్తులోనూ నేతలు తమ మాట వినకపోతే పరిస్థితి ఏమిటనే దానిపై కేసీఆర్ మల్లగుల్లాలు అవుతున్నట్లు సమాచారం. ఇదంతా మనసులో పెట్టుకుని కూతురికే కారు స్టీరింగ్ ఇవ్వబోతున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. కారు నడిపేదెవరో చూడాలి మరి. 

Also Read :  సుమ కనకాల కొడుకుతో సందీప్ రెడ్డి వంగా.. షూటింగ్ మొదలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు