నేను త్యాగం చేస్తేనే రేవంత్‌కు సీఎం పదవి.. మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సరికొత్త వివాదం రాజుకుంది. ‘నేను త్యాగం చేస్తేనే ఆయనకు సీఎం పదవి వచ్చింది. నాకే హెలికాప్టర్‌ లేదంటారా?’ అని మంత్రి కోమటిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

New Update
komatireddy

మంత్రి కొండా సురేఖతో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన విషయం అందరికీ తెలిసింది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవలే అక్కినేని ఫ్యామిలీపై దారుణమైన ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు మరో వివాదం భగ్గుమంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు జరుగుతున్నాయి. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా ఓ రేంజ్ లో వార్ జరుగుతుంది. 

ఇది కూడా చదవండిః నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

ఇలా ప్రతి విషయంలోనూ కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి కాస్త తలనొప్పిగా మారిందని కొందరు గుస గుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో మరో వ్యవహారం కొత్త తలనొప్పికి దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వంలో సరికొత్త వివాదం రాజుకుంది. హెలికాప్టర్‌ వినియోగంలో నేను సీఎం కన్నా తక్కువ కాదు అనే రీతిలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

నాకే హెలికాప్టర్‌ లేదంటారా?

ఇది కూడా చదవండిః పైసా పనిలేదు.. రాష్ట్రానికి లాభం లేదు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

 'నేను త్యాగం చేస్తేనే ఆయనకు సీఎం పదవి వచ్చింది. అలాంటి నాకే హెలికాప్టర్‌ లేదంటారా?.. నేను ఎప్పుడు అవసరమైతే అప్పుడు హెలికాప్టర్‌ను వాడుకుంటాను’ అని మంత్రి కోమటిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిగా మారింది. ఇప్పుడిదే సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన తీరుపై అధికారులు సమాధానాలు ఇస్తున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప.. మరే ఇతర పనులకు మంత్రులు హెలికాప్టర్‌ వినియోగానికి నిబంధనలు వర్తించవని అధికారులు చెబుతున్నారు. దీంతో కోమటిరెడ్డి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి మరో కొత్త తలనొప్పి అనే చెప్పాలి.

ఇది కూడా చదవండిః సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!

ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు హెలికాప్టర్‌ వ్యవహారం సరికొత్త తలనొప్పికి దారితీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రి కోమటి రెడ్డి ఇప్పటికే పలుమార్లు హెలికాప్టర్‌ను వాడుకున్నారు. అదే క్రమంలో ఇటీవల హెలికాప్టర్‌ కావాలని కోరడంతో ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అందుకు నిరాకరించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండిః పవన్‌ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్.. కీలక బాధ్యతలు..!

ఇందులో భాగంగానే ముఖ్యమంత్రికి మాత్రమే హెలికాప్టర్‌ ఉపయోగించే వీలుంటుందని సదరు అధికారి మంత్రికి చెప్పారు. అంతేకాకుండా మంత్రులు అత్యవసర సమయాల్లో మినహా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించే వీలుండదని తమ నిబంధనల గురించి మంత్రికి చెప్పారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘నేను త్యాగం చేస్తేనే ఆయన సీఎం అయ్యారు. మీరు నాకే హెలికాప్టర్‌ లేదంటారా.. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు హెలికాప్టర్‌ను వాడుకుంటాను. నేను వెళ్లే పని అత్యవసరం కాదనా మీ ఉద్దేశం’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

వనజీవి రామయ్యకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలకు హాజరైన మంత్రి పొంగులేటి!-PHOTOS

వనజీవి రామయ్య అంత్యక్రియలు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో కొద్ది సేపటి క్రితం ముగిశాయి. ప్రభుత్వ లాంఛానాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తదితరులు హాజరై.. రామయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.

New Update
Vanajeevi Ramaiah
Advertisment
Advertisment
Advertisment