/rtv/media/media_files/2026/04/04/khanapur-2026-04-04-17-06-38.jpg)
Khanapur Chairman election postponed..
Khanapur Chairman election : గతంలో వాయిదా పడిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక మరోసారి వాయిదాపడింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 12 వార్డులున్న ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7 కాగా ఎవరికీ మెజారిటీ రాలేదు. బీఆర్ఎస్ , బీజేపీలకు చెరో నాలుగు స్థానాలు రాగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఓటుతో పాటు, ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరుకుంది.
అయితే మ్యాజిక్ ఫిగర్ 7పై గందరగోళం నెలకొంది. అయితే ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.దీంతో వారి సంఖ్యాబలం 8కి చేరుకుంది. చైర్మన్‌గా బీజేపీ అభ్యర్థి, వైస్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని రెండు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఖానాపూర్ ను ఎలాగైన కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి మౌనికకు ఏడుగురు కౌన్సిలర్ల మద్దతు ఇవ్వడంతో చైర్మన్‌గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగనే ఎన్నికల సమయంలో తమకు కూడా ఏడుగురు సభ్యులు మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో మెంబర్ వెడ్మ బొజ్జు నిరసనకు దిగడం గమనార్హం. దాంతో కౌన్సిల్‌లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికను రేపటి వాయిదా వేశారు.
నిరసనకు దిగిన కౌన్సిలర్లు
అయితే తమకు పూర్తి బలం ఉన్నప్పటికీ ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయడం పట్ల బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్ ఎన్నుకోవడానికి సరిపడ కోరం ఉన్నప్పటికీ ఎన్నికను నిర్వహించకుండా అధికారులు వాయిదా వేయడం ఏంటని కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు.కలెక్టర్ వచ్చి ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికను నిర్వహించాలని, లేదంటే ఇక్కడనే చస్తాం కానీ లేవమాని తేల్చి చెప్పిన కౌన్సిలర్లు కౌన్సిల్ లోనే నిరసన తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా వారికి మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, బీఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజక వర్గం ఇంచార్జ్ జాన్సన్ నాయక్ లు బయట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించిన బీజేపీ 8 వార్డ్ కౌన్సిలర్ బొప్పారావు సత్యవతి కళ్లుతిరిగి కిందపడిపోయారు. ఆందోళన చెదిన మిగతా కౌన్సిలర్లు ఆమెకు పరిచర్యలు చేశారు. నీళ్లు ముఖంపై కొట్టి మంచి నీళ్లు అందించడంతో ఆమె తేరుకున్నారు. కాగా కౌన్సిలర్ల ఆందోళన కొనసాగుతుండటంతో ఖానాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు మన్సిపల్ కార్యాలయానికి భారీగా చేరుకుంటుండంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Follow Us