ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఉగాది రోజే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పండగ పూట ఆదివారం ఉదయమే ఈ ఘటన జరిగింది. లంకపల్లి శివారులో ఆయిల్ ట్యాంకర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు కండక్టర్ సీతారామ ప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆర్టీసీ బస్సు ఓవైపు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ముందుబాగం మొత్తం ధ్వంసమైంది.
ట్యాంకర్ ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
— Sateesh Vinjam (@Sateesh_Vinjam) March 30, 2025
ఖమ్మం జిల్లాలో ఉగాది పండుగ వేళ విషాదం...
డ్యూటీ దిగి ఇంటికి వెళ్తున్న బస్సు కండక్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన పెనుబల్లి మండలం కొత్త లంకపల్లిలో జరిగింది.
తెల్లవారుజామున ఆగి ఉన్న ట్యాంకర్‌ను లగ్జరీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి… pic.twitter.com/VZTF7skKXg
Also read: BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..?
ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వైజాగ్ నుంచి ఖమ్మం వస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్పించారు. కండక్టర్ సీతారామ ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కండక్టర్ మృతితో ఖమ్మం జిల్లా ఆర్టీసీ డిపోలో విషాదం నెలకొంది.
Also read: Kamareddy: పండగపూట విషాదం.. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృతి