/rtv/media/media_files/2025/03/06/ztqoim08YrB8Uh9sBMH0.jpg)
CM Revanth Reddy Meets Jana Reddy
జానారెడ్డిని ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా రేవంత్ రెడ్డి నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.ప్రభుత్వం అడిగితే సలహాలు ఇస్తానని జానారెడ్డి బుధవారం మీడియాతో తెలిపారు. దీంతో వీరి భేటీపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జానారెడ్డి వ్యాఖ్యల వల్లే.. ముఖ్య సలహాదారు పదవి ఆఫర్ చేయడానికి సీఎం వెళ్లారంటూ చర్చించుకుంటున్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడైన జానారెడ్డి గత కొంతకాలంగా ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కుమారుడు జైవీర్ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడంతో ఆయన పోటీ చేసి విజయం సాధించారు.
అయితే నల్గొండ పార్లమెంట్‌కి పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని జానారెడ్డి చెప్పారు. అయితే ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కాగా జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 15 ఏళ్లు మంత్రిగా పనిచేశారు.
ఇది కూడా చూడండి: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
తెలంగాణలో కులగణన అంశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందిస్తూ, తాను కులగణనలో ఎటువంటి పాత్ర పోషించలేదని స్పష్టం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని, ఎవరైనా విచారణ జరిపి తన దగ్గరకి వస్తే వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.తాను ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నానని జానారెడ్డి తెలిపారు. రాజకీయాల్లో తన పాత్ర గురించి స్పష్టత ఇస్తూ, ప్రజలు లేదా పాలకులు తమ అవసరానికి అనుగుణంగా సలహాలు, సూచనలు అడిగితే మాత్రమే తన అభిప్రాయాన్ని చెబుతానని అన్నారు. లేదంటే, రాజకీయ అంశాలపై స్పందించబోనని పేర్కొన్నారు. జానారెడ్డి అన్న మాటల విషయంలో రేవంత్ రెడ్డి ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రభుత్వానికి రాజకీయ సలహాలు ఇవ్వడానికి జానారెడ్డిని నియమించేలా అధిష్టానంతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.