/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-13-41-35.jpg)
KA Paul's sensational allegations about kavitha
KA Paul : కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపనపై కేఏ పాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తండ్రి కేసీఆర్‌తో వచ్చిన విభేదాల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని పాల్ వ్యాఖ్యానించారు. గతంలో కవిత ముఖ్యమంత్రి పదవిని ఆశించగా, కేసీఆర్ అందుకు నిరాకరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. కవిత పెట్టబోయే పార్టీ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, కేవలం తన ఆస్తులను కాపాడుకోవడానికే ఆమె ఆరాటపడుతున్నారని విమర్శించారు.ఈ సందర్భంగా 2008 నాటి ఒక సంఘటనను పాల్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కవిత తన వద్దకు వచ్చి పార్టీ నిధుల కోసం రూ. 10 కోట్లు అడిగారని, తాను రూ. 15 కోట్లు ఇద్దామని భావించినట్లు చెప్పారు. అయితే, కవితకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని కేసీఆర్ స్వయంగా తనను కోరడంతో వెనక్కి తగ్గానని పాల్ వెల్లడించారు. అమెరికా పర్యటనలో బిజీగా ఉండటం వల్ల ఇన్ని రోజులు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించలేకపోయానని ఆయన వివరించారు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు... ట్రంప్‌తో చర్చలు
అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను నివారించేందుకు తాను కృషి చేస్తున్నానని పాల్ తెలిపారు. ఈ యుద్ధాన్ని ఆపకపోతే ప్రపంచవ్యాప్తంగా సుమారు 850 కోట్ల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించేందుకు తాను డొనాల్డ్ ట్రంప్‌తో సంప్రదింపులు జరుపుతున్నానని, ట్రంప్ సహా పలు దేశాల ప్రతినిధులు తన సలహాలను తీసుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అభివృద్ధి చేసే సామర్థ్యం తనకు ఉందని, పెద్ద ఎత్తున అప్పులు (ధన సాయం) తీసుకురాగలనని పాల్ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా మేధావులు, సామాన్యులు అందరూ కలిసి రావాలని కోరారు. అభివృద్ధిని కాంక్షించే వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Follow Us